30.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణసైబర్‌ క్రైమ్‌ విచారణ..

సైబర్‌ క్రైమ్‌ విచారణ..

సైబర్‌ క్రైమ్‌ విచారణ..

హైదరాబాద్: 9 యదార్థవాది ప్రతినిది

హైదరాబాదు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కాంగ్రెస్‌ వార్‌రూమ్‌ రాజకీయ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు సోమవారం రెండు గంటల పాటు విచారించిన పోలీసులు.. సోషల్‌ మీడియా వేదికగా పోస్టుల వివరాలను సునీల్‌ నుంచి సేకరించినట్లు తెలుస్తోంది. ఈ కేసు విషయంలో మరోసారి సునీల్‌ను విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం.. విచారణ అనంతరం సునీల్‌ మీడియాతో మాట్లాడటానికి నిరాకరించాడు.. రాష్ట ముఖ్యమంత్రిపై కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత పై సోషల్ మీడియాలో కించ పరిచేవిదంగా పోస్టులు పెట్టాడని సునీల్‌పై ఆరోపణలు ఉన్నాయి.. గత ఏడాది నవంబర్‌ 24న జూబ్లీహిల్స్‌లో సునీల్‌ నిర్వహిస్తున్న కార్యాలయంలో సైబర్‌ క్రైం పోలీసులు అక్కడున్న కంప్యూటర్లు, హార్డ్‌ డిస్క్‌లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. సునీల్‌ కనుగోలు వద్ద పనిచేస్తున్న మెండా ప్రతాప్‌, శశాంక్‌, ఇషాంత్ శర్మను అదుపులోకి తీసుకున్న పోలీసులు. విరు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సునీల్‌ కనుగోలును ప్రధాన నిందితుడిగా హైదరాబాద్ అదనపు సీపీ విక్రమ్‌సింగ్‌మాన్‌ పేర్కొన్న విషయం మనకు తెలిసిందే…

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్