35.7 C
Hyderabad
Saturday, April 19, 2025
హోమ్తెలంగాణఅంకిత భావంతో వృత్తి ధర్మాన్ని నిర్వహించాలి: పోలీస్ కమీషనర్

అంకిత భావంతో వృత్తి ధర్మాన్ని నిర్వహించాలి: పోలీస్ కమీషనర్

అంకిత భావంతో వృత్తి ధర్మాన్ని నిర్వహించాలి: పోలీస్ కమీషనర్

-బదిలీ పై వెళ్తున్న ఏసీపీ, ఆర్ఐ లకు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు.

గోదావరిఖని యదార్థవాది ప్రతినిది

వృత్తి పట్ల బాధ్యత అంకిత భావం విధేయత కలిగి ఉంటే ఎక్కడ విధులు నిర్వహించిన సంతృప్తికరమైన జీవితం గడుపుతారని రామగుండం పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి (డిఐజి) పేర్కొన్నారు.. రామగుండం పోలీస్ కమిషనరేట్ నుంచి బదిలీపై వెళుతున్న
జైపూర్ ఏసీపీ గోపతి నరేందర్, గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి మోహన్, అర్ముడ్ రిజర్వు ఇన్స్పెక్టర్ మధుకర్, శ్రీధర్, అంజన్న అనిల్, రాజేష్ లకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల తరఫున ఆదివారం ఘనంగా ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం గోదావరిఖనిలోని ఇల్లందు క్లబ్ లో నిర్వహించారు. జరిగింది. ఈ కార్యక్రమానికి సీపీ ముఖ్య అతిథిగా పాల్గొని అధికారులతో కలిసి బదిలీపై వెళ్తున్న పోలీస్ అధికారులకు జ్ఞాపికాలను అందచేసి శాలువా తో సత్కరించారు.. ఈ సందర్బంగా సీపీ రెమా రాజేశ్వరి మాట్లాడుతూ ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకొని, ఎప్పటికప్పుడు పరిస్థితులను అవగాహన చేసుకుంటూ, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం ద్వారానే ప్రజల హృదయాల్లో అమూల్యమైన స్థానం పొందవచ్చుని, విధులు అంకితభావంతో నిర్వహిస్తూ, ఎక్కడి సమస్యలు అక్కడే చాకచక్యంగా పరిష్కరించే అధికారులు ఉన్నప్పుడే ఉన్నతాధికారులకు ఊరట కలుగుతుందని, తద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం కలుగుతుందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీ సర్వసాధారణమని తాము ఎక్కడ విధులు నిర్వహించిన అంకిత భావంతో వృత్తి ధర్మాన్ని నిర్వర్తించి పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కాలానుగుణంగా ఎన్నో మార్పులు సమాజంలో వస్తున్నాయని సమయాన్ని సందర్భాన్ని బట్టి విధులు నిర్వర్తించాలని విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏసీపీ నరేందర్, గిరి ప్రసాద్ లు మాట్లాడుతూ సమర్థవంతమైన, వృత్తి పట్ల అంకిత భావం గల కమిషనర్ దగ్గర పని చేయడం వల్లనే ఎప్పటికప్పుడు సందర్భోచితంగా సూచనలు పొంది, ప్రజల సమస్యలు పరిష్కరించడం సాధ్యమైందని తద్వారా తమకు కూడా మంచి పేరు వచ్చిందని వివిధ సందర్భాలను, పరిస్థితులను గుర్తు చేశారు. రామగుండం కమీషనరేట్ లో పనిచేయడానికి అధికారుల నుండి మన్ననలు పొందడనికి పోలీస్ అధికారుల, సిబ్బంది, సహకారం మరువలేనిది అని అందరికీ పేరు పేరునా ఏసీపీ లు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.. కార్యక్రమంలో పెద్దపల్లి డిసిపి వైభవ్ గైక్వాడ్, మంచిర్యాల డిసిపి సుధీర్ కేకన్, పెద్దపల్లి ఏసిపి మహేష్, మంచిర్యాల ఎసిపి తిరుపతిరెడ్డి, బెల్లంపల్లి ఏసిపి సదయ్య, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి మోహన్, సిసిఎస్ ఏసీపీలు వెంకటేశ్వర్లు, ఉపేందర్, సి హెచ్ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ ఏసిపి బాలరాజు, ఏఆర్ ఏసి పి లు సుందర్ రావు, మల్లికార్జున్, కమ్ స్టేట్ పరిధిలోని సిఐలు, ఆర్ఐ లు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్