అనర్షులను తోలగించాకే డ్రా తీయాలి. ఫిర్యాదులను 10రోజులపాటు స్వీకరించాలి..
పేదలకు న్యాయం చేయని మున్సిపల్ పాలకవర్గం వెంటనే రాజీనామా చేయాలి…
యదార్థవాది ప్రతినిది హుస్నాబాద్
టిఆర్ఎస్ ప్రభుత్వం పేదలందరికీ రెండు పడకల ఇండ్లు కట్టి ఇస్తామని చెప్పి అనర్షులకు ఇండ్ల మంజూరి చేసి పేదలకు తీవ్ర న్యాయం చేస్తుందని అందుకు హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ కు పాలకవర్గం వంత పడుతుందని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్ అన్నారు. బుధవారం మున్సిపల్ కార్యాలయం వద్ద డబుల్ బెడ్ రూం ల జాబితాలో జరిగిన అవకతవకలపైన సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో అయన మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు గత నెలలో రెండు పడకల ఇండ్లు జాబితా ప్రకటించగా చాలా వరకు అనర్హులకే ఇండ్లు వచ్చాయని, జిల్లా మంత్రి హరీష్ రావు, కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే చోరవతీసుకోని 16న లబ్దిదారుల డ్రా ను వెంటనే నిలిపివేసి మళ్లీ రీసర్వే
చేసి అసలైన పేదలకు అందించాలని అన్నారు. రీ సర్వేలో మొదటి జాబితాలో ఉన్న లబ్ధిదారులు రెండవ జాబితాలో కూడా వున్నారని, సర్వే అధికారుల నిర్లక్ష్యం, పాలకుల పనితీరు వల్లే ఇండ్ల సర్వే తప్పుల తడకతో ఉన్న జాబితాలోని పేర్లను డ్రా లో వేయడం ద్వారా అర్హులైన పేదలకు డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు కొహెడ కొమురయ్య, అయిలేని సంజివరెడ్డి,ఎగ్గొజు సుదర్శన్ చారి, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ, ఎఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు జనగాం రాజు కుమార్, జంగ విజయ, అర్షలైన ఇండ్లు మంజూరి కాని పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలు, యువతి, యువకులు పాల్గొన్నారు.