34.2 C
Hyderabad
Monday, April 22, 2024
హోమ్తెలంగాణఅన్ని అబద్ధాలే.. కెసిఆర్ పై విరుచుకుపడ్డ కిషన్ రెడ్డి...

అన్ని అబద్ధాలే.. కెసిఆర్ పై విరుచుకుపడ్డ కిషన్ రెడ్డి…

కేంద్ర ప్రభుత్వంపై గత రెండు రోజుల నుండి సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో .. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందిచరు. మంగళవారం ఢిల్లీలో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. తెలంగాణాలో కెసిఆర్ రైతులను మభ్య పెడుతున్నారన్నారు. ఎన్ని బెదిరింపులు చేసినా, అతని మాటలకు ఎవరు భయపడరని, ధాన్యం సేకరణ కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రజలకు వివరిస్తామన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాకముందు తెలుగు రాష్ట్రాలలో.. 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తూఉండేదని, బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత 151 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణలో 2014లో 43 లక్షల మెట్రిక్ టన్నులు సేకరిస్తే, ప్రస్తుతం 94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం సేకరణకు పెద్ద ఎత్తున ఖర్చు చేస్తుంది, అలాగే కేంద్ర ప్రభుత్వం గన్నీ సంఖ్యలు కూడా ఇస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ధాన్యం సేకరణలో రూపాయి కూడా ఖర్చు చేయడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మన్యం ఉత్పత్తి అంచనా వేయడంలో విఫలమైందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 108 మెట్రిక్ టన్నులు ఉంటుందని కంటి చూపుతో రాష్ట్రప్రభుత్వం అంచనా వేసి కేంద్రానికి లేఖ రాశారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 41 లక్షల మెట్రిక్ టన్నుల కే ఒప్పందం చేసుకొని, ఇప్పుడేమో 108 మెట్రిక్ టన్నులు కొనాలని అంటున్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్