28.2 C
Hyderabad
Tuesday, April 22, 2025
హోమ్తెలంగాణఅభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా!

అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా!

అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా!

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ లకు కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు.. ఉత్తర తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని శ్రీ రేణుక ఎల్లమ్మను పార్టీ శ్రేణులతో కలిసి పొన్నం ప్రభాకర్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అయన సమవేశంలో మాట్లాడుతూ తెలంగాణ సాధించుకొని తొమ్మిదేళ్లు గడుస్తున్న ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. తెలంగాణను సోనియా గాంధీ ఏ ఉద్దేశంతో ఇచ్చిందో ఆ ఉద్దేశం నెరవేరిందో లేదో గుండెల మీద చేయి వేసుకొని ఆలోచించుకోవాలన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల నెరవేర్పుకై జరుగుతున్న పోరాటంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దశాబ్ద కాలంలో వందేళ్లు బ్రతికేంత ఆస్తులను కేసిఆర్ కుటుంబం సంపాదించుకుందని ఆరోపించారు. తెలంగాణ విభజన అప్పుడు ఉన్నటువంటి 60 వేల కోట్ల అప్పు, ఇప్పుడు ఆరు లక్షల కోట్లకు చేరి ప్రజలకు భారంగా మారిందే తప్ప, తెలంగాణలో అభివృద్ధి ఎక్కడ వేసినా గొంగళి అక్కడి లాగానే ఉందని ఎద్దేవా చేశారు. బిఆర్ఎస్ అంటే ట్యాంక్ బండ్లు, రోడ్డు డివైడర్లు, స్ట్రీట్ లైట్లు తప్ప మరేమీ లేదన్నారు.ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ పూదరి లక్ష్మీనారాయణ పిసిసి సభ్యులు కేడo లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బంక చందు, కౌన్సిలర్ వల్లపు రాజు, విశ్వతేజ, ఆలయ అర్చకులు పరమేశ్వర శర్మ, సిబ్బంది రమేష్, కుమార్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్