27.7 C
Hyderabad
Tuesday, February 11, 2025
హోమ్తెలంగాణఅభివృద్ధిలో సిద్దిపేటను మరిపిస్తా: మంత్రి పొన్నం 

అభివృద్ధిలో సిద్దిపేటను మరిపిస్తా: మంత్రి పొన్నం 

అభివృద్ధిలో సిద్దిపేటను మరిపిస్తా: మంత్రి పొన్నం 

అభివృద్ధిలో ముందు ఉంచుతా.

• నియోజకవర్గ ఓటర్లు రాష్ట్రంలో తల ఎత్తుకునేలా చేస్తా.

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిధి 

హుస్నాబాద్ నియోజకవర్గ శాసనసభ సభ్యునిగా రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పొన్నం ప్రభాకర్ తన సొంత నియోజకవర్గమైన హుస్నాబాద్ లో పర్యటిస్తున్నారు అందులో భాగంగా మంగళవారం హుస్నాబాద్ పట్టణ మున్సిపాలిటీ కౌన్సిలర్లతో మొదటిసారిగా సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి అనేది పార్టీలతో సంబంధం లేకుండా అభివృద్ధి చేస్తానని అన్నారు. ఇప్పటికే ఎన్నికైన కౌన్సిలర్లు పార్టీల తోటి సంబంధం లేకుండా ఏ సమస్య అయినా ఆ దృష్టికి వచ్చిన వెంటనే నా వంతుగా అభివృద్ధికి సహకరిస్తానని ఎన్నికల వరకే రాజకీయాలని ఎన్నిక తర్వాత ప్రజలకు సేవ చేయడానికి తన పూర్తి సమయం వెచ్చిస్తానని ఇక్కడే స్థానికంగా ఉంటానని తెలిపారు. ఇప్పటికే అకుల రజిత మున్సిపాలిటీలో ఉన్న సమస్యలను నా దృష్టికి తెచ్చారని తను ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తానని ముఖ్యంగా హుస్నాబాద్ నియోజకవర్గానికి మెడికల్ కాలేజీ మంజూరుకు కృషి చేస్తానని అన్నారు. గౌరవెల్లి నిర్వాసితులకు ఒప్పించి మెప్పించి వారికి పునరావాసం ఏర్పాటుకు కృషి చేస్తా అలాగే స్థలం ఉండి అర్హులైన వారందరికీ ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేస్తుందని. ఇక డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులు సమస్యలు ఉండవని అన్నారు. గతంలో తాను పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినప్పుడు వరంగల్లో కూడా అందుబాటులో లేని పాస్పోర్ట్ కార్యాలయాన్ని కేంద్రీయ విద్యాలయాన్ని కరీంనగర్ కు తెచ్చామని అదేవిధంగా హుస్నాబాద్ కు కూడా కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయిస్తానని తెలిపారు. ఎల్లమ్మ చెరువును అన్ని విధాలుగా అభివృద్ధి చేయిస్తామని సిద్దిపేట కోమటి చెరువు హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కన్నా చాలా చిన్నది అని అంతకుమించి సుందరీకరణ చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ఈ నియోజకవర్గ నా ఊరు అని ఇదే నా నివాసం అని నా ఇంటిని బాగు చేసుకునే బాధ్యత నా మీద ఉందని అన్ని వర్గాల ప్రజలు అందరి అభిప్రాయాలతో అభివృద్ధిలో ముందుకు వెళ్దామని మున్సిపాలిటీ కౌన్సిలర్లను పట్టణ ప్రముఖులను ఉద్దేశించి తెలియజేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులను పరామర్శించి అక్కడే వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ అన్నదానం ప్రతిరోజు నిరంతరంగా కొనసాగాలని నా వంతుగా ఒక రోజు అన్నదాన కార్యక్రమాన్ని చేపడతానని తెలిపారు.

మునుపటి వ్యాసం
తదుపరి ఆర్టికల్
RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్