అర్హులైన వారికి మాత్రమే డబుల్ బెడ్ రూములు ఇస్తాం.. ఎమ్మెల్యే

297

అర్హులైన వారికి మాత్రమే డబుల్ బెడ్ రూములు ఇస్తాం.. ఎమ్మెల్యే

హుస్నాబాద్ 25 డిసంబర్ 22

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఎలాంటి పక్షపాతం వహించం, డ్రా పడతి ప్రకారమే లబ్ధిదారుల ఎంపిక చేస్తామని తన క్యాంపు కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు 1400 అప్లికేషన్స్ వచ్చాయని, ఈ అప్లికేషన్స్ ఆధారంగా 489 మంది లబ్ధిదారులు అర్హులు. 284 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లబ్ధిదారులకు అందజేయడానికి రెడీగా ఉన్నాయని తెలిపారు. నిష్పక్షపాతంగా లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని, డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు. ఎలాంటి ఫిర్యాదులు ఉన్న మున్సిపల్ కార్యాలయం లో, ఎమ్మార్వో కార్యాలయంలో ఫిర్యాదు బాక్సులు పెట్టడం జరిగింది తమ ఫిర్యాదులను అందులో వేయవచ్చుని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఎలాంటి పైరవీలకు తావులేదు, సోశామిడియలో వచ్చే పుకారులు నమ్మవద్దుఅని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వైస్ సాయి రెడ్డి రాజిరెడ్డి, మునిసిపల్ చేర్పర్సన్ ఆకుల రాజిత, తదితరులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి