30.7 C
Hyderabad
Friday, April 19, 2024
హోమ్తెలంగాణఅవినీతి నిర్ములనే సీసీర్ ప్రథమ లక్ష్యం…

అవినీతి నిర్ములనే సీసీర్ ప్రథమ లక్ష్యం…

అవినీతి నిర్ములనే సీసీర్ ప్రథమ లక్ష్యం…

సిద్దిపేట జిల్లా నూతన కార్యాలయం ప్రారంభం

యదార్థవాది ప్రతినిది సిద్దిపేట

అవినీతి నిర్మూలనే సీసీర్ సంస్థ ప్రథమ లక్ష్యమని కౌన్సిల్ ఫర్ సిటీజేన్ రైట్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంచకట్ల అనిల్ కుమార్ అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సీసీర్ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యాలయం వద్ద ఘనంగా జాతీయ జెండానూ ఆవిష్కరించారు. అనంతరం సంస్థ కార్యాలయాన్ని కో ఫౌండర్స్ మారుతి, ప్రశాంత్, సీసీర్ తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ ప్రభు, సెంట్రల్ కమిటీ మెంబర్స్ శ్రీనివాస్,స్టేట్ మీడియా కోఆర్డినేటర్ సాజిద్. స్టేట్ జైంట్ సెక్రెటరీ & జిల్లా అధ్యక్షుడు గుండ్ల శివ చంద్రంతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ పాలనలో జవాబుదారీతనాన్ని పెంచేలా సీసీర్ పనిచేస్తుందని అన్నారు.అవినీతి రవిత ప్రజస్వామ్యాన్ని నిర్మించడం ప్రతి ఒక్క పౌరుని బాధ్యత అని గుర్తు చేశారు. రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కులపై అవగాహన ఉండలని ప్రశ్నించడం అలవాటుగా మారినప్పుడే సామాన్యుల జీవితాలు బాగుపడతాయన్నారు. ఇప్పటివరకు సంస్థ ఆధ్వర్యంలో అనేక విజయాలు సాధించామని తెలిపారు.ఆర్ టి ఐ చట్టాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం నూతన సభ్యులకు డి ఐడీ కార్డులు, నియామక పత్రాలను అందేశారు. సిద్దిపేట సీసీర్ సంస్థ సభ్యులు నిర్వహించిన అనేక కార్యమాలపై ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీసీర్ సిద్దిపేట జిల్లా సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్