31.2 C
Hyderabad
Friday, June 21, 2024
హోమ్తెలంగాణఅసెంబ్లీలో ఒకే ఒక్కడు పుస్తక ఆవిష్కరణ.

అసెంబ్లీలో ఒకే ఒక్కడు పుస్తక ఆవిష్కరణ.

అసెంబ్లీలో ఒకే ఒక్కడు పుస్తక ఆవిష్కరణ.

హైదరాబాద్ యదార్థవాద్ ప్రతినిధి

దేశంలో కమ్యూనిస్టుల అవసరం చాలా ఉన్నదని బిజెపి మినహా అందరూ భావిస్తున్నారన్నారని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజెయు) జాతీయ అధ్యక్షుడు ప్రజాపక్షం సంపాదకులు కె.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కూనంనేని సాంబశివరావు ఒక మంచి సాంబశివరావు మంచి ఎడిటర్ అని మంచి కమ్యూనికేటర్ అని అన్నారు. ప్రజలతోనే జీవించాలని కలివిడిగా ఉండాలన్న భావన ఒక్కో వ్యక్తికి ఒక రకంగా ఉంటుందని కూనంనేని సాంబశివరావులో ఎక్కువగా ఉంటుందన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావుపై  సీనియర్  జర్నలిస్టు షేక్ హసీన రచించిన “అసెంబ్లీలో ఒకే ఒక్కడు” పుస్తకావిష్కరణ సభ హైదరాబాద్ మగ్ధూం భవన్ గురువారం జరిగింది. సిపిఐ మాల్కాజిగిరి మేడ్చల్ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య సభాధ్యక్షతన జరిగిన సభలో పుస్తకాన్ని  కె.శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సభకు సిపిఐ కార్యదర్శి శాసనసభాపక్ష నేత కూనంనేని సాంబశివరావు జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి సిఆర్ ఫౌండేషన్ మహిళా సంక్షేమ కేంద్రం డైరక్టర్ డి.కృష్ణకుమారి తెలంగాణ శ్రామిక మహిళా ఫోరం రాష్ట్ర కన్వీనర్ ప్రేంపావని తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఆర్ ప్రవక్త సుదర్శన్ ప్రధాని మోడీ తమకు శత్రువు కమ్యూనిస్టులేనని చెప్పారనిగుర్తు చేశారు. ఒక పార్టీ నుండి మరో పార్టీకి ఎవ్వరూ వెళ్లినా ప్రజలు పట్టించుకోలేదని కమ్యూనిస్టులు మారితేనే ఇబ్బందులు వస్తాయని అందరికీ అనిపిస్తోందన్నారు. ఒక పార్టీ నుండి ఇతర పార్టీలకు వెళ్లి తిరిగి తాము ఇది వరకు ఉన్న పార్టీలను తిట్టే వారిని ప్రజలు మన్నిస్తున్నారని, కానీ కమ్యూనిస్టులను మన్నించడం లేదని వివరించారు. ప్రస్తుత  బిజెపి అసలు బిజెపి కాదనే భావన ఆర్ బాగా వచ్చిందని బిజెపి భావాలకు కట్టుబడని వ్యక్తులే ఎక్కువగా ఉన్నారని వివరించారు. నాయకులు చెబుతున్న అంశాలు వారి మాటలు కింది స్థాయిలోని ప్రజలకు చదువు రాని వారికి కూడా చేరాలని అప్పుడే ఆ సందేశాలు ప్రజలకు చేరుతాయన్నారు. “అసెంబ్లీలో ఒకే ఒక్కడు” పుస్తక రచయిత షేక్ హసీనను పుస్తకాన్ని తీసుకొచ్చినందుకు ప్రొత్సహించి సహకరించిన డి.కృష్ణకుమారిని శ్రీనివాస్ రెడ్డి అభినంధించారు. ఒక వ్యక్తి గురించి పుస్తకాన్ని రాసే సమయంలో రచయితకు స్వేచ్ఛ ఉంటుందని అదే సమయంలో ఆ వ్యక్తికి సంబంధించి తప్పులు దొర్లితే వాటిని సవరించే హక్కు కూడా ఆ వ్యక్తికి ఉంటుందని వివరించారు. కవి రచయితలకు మనిషికి సమాజం నుండే ఆలోచనలు వస్తాయని రాజుల కాలంలో ఆస్తాన కవులు రాజుల గురించి మాత్రమే రచనలు చేసే వారని గుర్తు చేశారు.  సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కమ్యూనిస్టుల చరిత్రను త్యాగాలు చేసిన వ్యక్తుల చరిత్ర పట్ల పుస్తకాలు రాయాల్సిన అవసరం ఉన్నదన్నారు. పుస్తకాలు రాసే క్రమంలో కంటెంట్ అంశాల వారిగా ప్రాధాన్యత పాటించాలని సూచించారు. పుస్తకాన్ని రచించినందుకు షేక్ హసీనను ఆయన అభినందించారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల గొంతుకే కమ్యూనిస్టుల గొంతు అని అన్నారు. కమ్యూనిస్టు పార్టీ ఎంఎల్ తీవ్ర ఒత్తిడి ఉంటుందని ఒకే ఎంఎల్ కావడంతో అన్ని రంగాలు అనేక సమస్యలను శాసనసభలో ప్రస్తావించాల్సి ఉంటుందని ఇందులో కూనంనేని సాంబశివరావు సఫలీకృతం అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. సిఆర్ ఫౌండేషన్ మహిళా సంక్షేమ కేంద్రం డైరక్టర్ డి.కృష్ణకుమారి మాట్లాడుతూ స్వాతంత్య్రం నుండి ఇప్పటి వరకు చరిత్ర మరుగుణపడిన మహిళల చరిత్రను ‘రెడ్ స్వాన్ పబ్లిషర్స్ వేదిక’ ద్వారా ప్రతి మూడు నెలలకు ఒకసారి పుస్తకాన్ని తీసుకొస్తామని తెలిపారు. మార్చి చివరి నాటికి ఒక పుస్తకాన్ని తీసుకురానున్నట్టు వివరించారు. పుస్తక రచయిత హసీన మాట్లాడుతూ జీవితాలను త్యాగం చేసి నిత్యం ప్రజల పక్షాన నిలడుతున్న పార్టీ సిపిఐ అని కొనియాడారు. అందరి పక్షాన శాసనసభలో ఒకే ఒక్కరుగా కూనంనేని సాంబశివరావు ఉన్నారన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్