35.2 C
Hyderabad
Wednesday, April 17, 2024
హోమ్జాతీయఆంధ్రకు పాలు సరఫరా నిలిపివేత ....

ఆంధ్రకు పాలు సరఫరా నిలిపివేత ….

ఆంధ్ర తక్షణమే రూ.130 కోట్ల రూపాయలు చెల్లిస్తేనే అంగన్వాడీలకు పాల సరఫరా చేస్తామని కర్ణాటక పాల ఫెడరేషన్ సోమవారం తేల్చి చెప్పిది. ఆంధ్రాలో సంపూర్ణ పోషణ పథకం కింద అంగన్వాడీలకు అందించే పాలు ఏపీ ప్రభుత్వం 2020 జూన్ లో కర్ణాటక పాల ఫెడరేషన్ తో ఒప్పందం చేసుకుంది. అంగన్వాడీ లలో సంపూర్ణ పోషణ పథకం ద్వారా చిన్న పిల్లలకు పాలు అందిస్తున్నారు. లీటర్ పై ఐదు రూపాయలు తగ్గించేందుకు గతములో కర్ణాటక పాల ఫెడరేషన్ ఒప్పుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ప్రతి నెలకు 110 లక్షల లీటర్ల పాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కర్ణాటక పాల ఫెడరేషన్ సరఫరా చేస్తోంది. గత నాలుగు నెలల నుండి ఆంధ్ర ప్రభుత్వం కర్ణాటక పాల ఫెడరేషన్ కు ఏలాంటి చెల్లింపులు చేయడం లేదు. దీంతో నిలిచిపోయిన రూ. 130 కొట్లకు చేరుకుంది. ఈ బకాయిలు విడుదల చేయాలని ఆంధ్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అయినా కూడా ఏపీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో కర్ణాటక పాల ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ బీసి సతీష్ పాల సరఫరా నిలిపి వేయాలని నిర్ణయించారు. మరోవైపు డీజిల్ పెట్రోల్, ధరలు పెరగడం ఇతర ఖర్చులతో ఆంధ్ర ప్రభుత్వానికి ఇచ్చే ఐదు రూపాయల సబ్సిడీని కూడా తొలగించాలని కర్ణాటక అలా ఫెడరేషన్ నిర్ణయం తీసుకుంది. పాల పై సబ్సిడీ నీ పై కూడా ఆంధ్ర ప్రభుత్వం స్పందించలేదని డైరెక్టర్ తెలిపారు. పెట్టుబడి, ఇంధనం ఖర్చులు పెరగడంతో కర్ణాటక పాల యూనిట్లు నష్టాల్లో కూరుకుపోయిదని తెలిపింది. అందువల్ల పాల పై సబ్సిడీలు ఇవ్వలేకపోతున్నామని స్పష్టంచేసింది. పాత దొరలకు పాలు సరఫరా చేయడం కుదరదని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అం ఉత్పత్తిదారులకు రూపాయలు చెల్లించలేక పోతున్నామని, అందువల్ల ఏపీ ప్రభుత్వం వెంటనే రూ.130 చెల్లించాలని, అలాగే పాల ధరలను లీటరుకు రూ. 5 పెంచితేనే పాల సరఫరా చేస్తామని కర్ణాటక పాల ఫెడరేషన్ ఎండి ఏపీ ప్రభుత్వానికి కి లేఖ రాశారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్