ఆపరేషన్ స్మైల్ IX..డిఐజి సుమతి

259

ఆపరేషన్ స్మైల్ IX..డిఐజి సుమతి

హైదరాబాదు 30 డిసంబర్

రాష్టంలో అన్ని జిల్లాల్లో విడియో కాన్ఫెరెన్స్ ఆపరేషన్ స్మైల్ IX..

తెలంగాణ రాష్ట్ర ఉమెన్ సెఫ్టీ వింగ్ డిఐజి సుమతి హైదరాబాదు నుండి ఆపరేషన్ స్మైల్ IX వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు…సుమతి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తేది: 01-01-23, 31-01-23 వరకు ఆపరేషన్ స్మైల్ IX ” కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, 18 సంవత్సరాల లోపు బాలబాలికలు తప్పిపోన, వదిలివేయబడిన, కార్మీకులుగా ఉన్న, ఉంటె వారి సమాచారం సేకరించి, తల్లి దండ్రులకు అప్పగించాలని, బిక్షాటన, వెట్టి చాకిరి చేయించిన వారిపై తగిన క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్ననారు. ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్, ద్వారా డిపార్ట్మెంట్కు మంచి పేరు వచ్చిందని, ఈసారి అధికారులు సిబ్బంది వివిధ డిపార్ట్మెంట్ అధికారులతో కలసి సమన్వయంతో విధులు నిర్వహించి రాష్ట్రానికి పోలీస్ డిపార్ట్మెంట్ కు మంచి పేరు తీసుకుని రావాలని సూచించారు, తప్పిపోయిన పిల్లలను వెతికి పట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించి వారి కడుపుకోత తీర్చాలని సూచించారు… తెలంగాణ రాష్టంలో బాల కార్మికులతో పని,వెట్టిచాకిరి చేయిస్తూకనిపిస్తే వెంటనే డయల్ 100, సంబదిత పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి