ఆరు నెలల శిక్షణ నిమిత్తం జిల్లాకు ట్రైనీ ఐపీఎస్.
సిరిసిల్ల యదార్థవాది ప్రతినిధి
శిక్షణలో భాగంగా 2022 బ్యాచ్ రాహుల్ రెడ్డిని సిరిసిల్ల జిల్లాకు ప్రాక్టికల్ శిక్షణ నిమిత్తం ఆరు నెలల రాజన్న సిరిసిల్ల జిల్లాకు కేటాయించగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కు రిపోర్ట్ చేశారు.
2022 బ్యాచ్ తెలంగాణకు చెందిన రాహుల్ రెడ్డి బి.టెక్ పూర్తి చేసి సివిల్ సర్వీసెస్ ద్వారా తెలంగాణ క్యాడర్ ఐపిఎస్ కు ఎంపికయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరు నెలల పాటు వివిధ విభాగాల్లో ప్రాక్టికల్ శిక్షణ పొందనున్నారు.