30.2 C
Hyderabad
Wednesday, June 12, 2024
హోమ్తెలంగాణఆరోగ్యశాఖ వాహనాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్..

ఆరోగ్యశాఖ వాహనాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్..

ఆరోగ్యశాఖ వాహనాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్..

హైద్రాబాద్ యదార్థవాది ప్రతినిది

హైదరాబాద్ లో పీపుల్స్ ప్లాజా వేదికగా 108, అమ్మఒడి వాహనాలు ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు..
అనంతరం తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులతో కలిసి సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.. ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడే నాటికి 316 అంబులెన్సులు ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 466 కు పెంచుకోగలిగామని అత్యవసర సేవలకు ఒకేరోజు 466 ప్రవేశ పెట్టడం సంతోషంగా ఉందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో లక్ష మందికి ఒక 108 వాహనం ఉంటే.. నేడు 75 వేలకు ఒక వాహనం అందుబాటులోకి వచ్చాయని ఆయన అన్నారు. మన తెలంగాణలో నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రులను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని, జిల్లాకు ఒక మెడికల్ కాలేజి, వరంగల్ హెల్త్ సిటీ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 50 వేల పడకలు అందుబాటులోకి వచ్చాయని, ఇప్పుడు కరోనా కాదు దాని తాత లాంటిది వచ్చినా ఎదుర్కొనెలా మన వైద్య రంగం పటిష్టం అయిందని ఆయన అన్నారు.. మాకు ఎలాంటి అనారోగ్యం వచ్చినా కేసిఆర్ ప్రభుత్వం అండగా ఉన్నదనే భరోసాతో తెలంగాణ ప్రజలు ఉన్నారని, దేశంలో ఉన్న బిజెపి, కాంగ్రెస్ రాష్ట్రాల్లో స్కాములు ఉంటే.. తెలంగాణలో స్కీములు ఉన్నాయని, బిజెపి, కాంగ్రెస్ పాలించే రాష్ట్రాల్లో కొట్లాటలు, స్కాములు తప్ప అభివృద్ధి శూన్యమని మంత్రి అన్నారు.. ఆశ కార్యకర్తల సెల్ ఫోన్ బిల్లును ఇకపై రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మహమ్మద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, హైదరాబాద్ మేయర్ బీఅర్ఎస్ రాష్ట్ర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్