30.2 C
Hyderabad
Wednesday, June 12, 2024
హోమ్తెలంగాణఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం

ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం

ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం

యదార్థవాది ప్రతినిధి నిజామాబాద్

పోలీస్ కమిషనరెట్ కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నూతన భవనాన్ని శుక్రవారం రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు..ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ హైదరాబాద్ ను తలపిస్తున్న నిజామాబాద్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటును ప్రభుత్వం పరంగా కాకుండా నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ సొంత ఖర్చులతో ఏర్పాటు చేసుకోవడం అత్యుత్తమ పనితీరుకు నిదర్శమని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యాచరణలో తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేకంగా శాంతి శాంతిభద్రతల్లో లా అండ్ ఆర్డర్ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని అందుకు తగ్గట్లుగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ హైదరాబాద్ లో ఏర్పాటు చేసుకున్నామని తెలంగాణలో పోలీస్ వ్యవస్థ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రధానమని అందుకు అనుగుణంగానే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పటిష్టత వల్ల పారిశ్రామికీకరణ పెట్టుబడులు రావడం జరుగు తుందని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను 160 సి.సి కెమెరాలతో పటిష్ట పరిచి హెచ్.డి క్లారిటీ కెమెరాల సాయంతో నగర శాంతి భద్రతలను కాపాడుతుందని మంత్రి తెలిపారు. హైదరాబాద్ నగరం తర్వాత రాష్ట్రంలోనే ఇంతటి గొప్ప ఏర్పాట్లను నిజామాబాద్ కలిగి ఉంటుందని ఈ ఘనత కమీషనర్ కు దక్కుతుందని అన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కె.ఆర్. నాగరాజు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ నగర మేయర్ శ్రీమతి దండు నీతూ కార్పోరేటర్ శ్రీమతి పంచరెడ్డి నర్సూబాయి ఏ.సి.పిలు సి.ఐలు ఎస్.ఐలు రిజర్వు ఇన్స్పెక్టర్స్ ఆర్.ఎస్.ఐలు పోలీస్ హౌజింగ్ బోర్డు ఈ. ఈ టి. ఈశ్వర్ పోలీస్ ఐ.టి కోర్ సిబంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్