29.2 C
Hyderabad
Friday, February 7, 2025
హోమ్తెలంగాణఈ పార్ల‌మెంట్ స‌మావేశాల్లో మ‌హిళా బిల్లును ఆమోదించాలి.

ఈ పార్ల‌మెంట్ స‌మావేశాల్లో మ‌హిళా బిల్లును ఆమోదించాలి.

ఈ పార్ల‌మెంట్ స‌మావేశాల్లో మ‌హిళా బిల్లును ఆమోదించాలి

జాతీయ ఉపాధ్యక్షుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం

యదార్థవాది హైదరాబాద్

పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని, ఇందుకు అన్ని పార్టీలు సహకరించాలని, బీసీ మహిళలకు సబ్‌ కోటా కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం ఒకప్రకతనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చ‌ట్ట‌స‌భ‌ల్లో రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించే మ‌హిళా బిల్లు చారిత్రక అవసరమేనని ఈ పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లుకు అన్ని పార్టీలు ఆమోదం తెలపాలని, మహిళా బిల్లు, బీసీలకు ప్రత్యేక వాటా కల్పించేందుకు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కృషి చేయాలన్నారు. మహిళలకు విస్తృత అవకాశాలు లేకపోతే దేశ ప్రగతి కూడా సాధ్యం కాదనే విషయం గుర్తుంచుకోవాలని, సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజకీయాలకు అతీతంగా ఏకమై అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని అయన అన్నారు. జేపీ సార‌ధ్యంలోని ఎన్డీఏ కూటమితో పాటు ఇండియా కూటమి, ఇతర పార్టీలు కూడా మహిళా బిల్లుకు ఆమోదం తెలపడానికి కదలిరావాలని, అన్ని రంగాల్లో మహిళలకు అన్యాయమే జరుగుతోందని అయన ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా బిల్లుకు ఆమోదం లభిస్తే చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు లభించడం ద్వారా వారి అభివృద్ధికి మరింత తోడ్పాటు ఇచ్చే అవకాశం కలుగుతుందన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్