33.2 C
Hyderabad
Thursday, March 13, 2025
హోమ్తెలంగాణఉషోదయ యూత్ అధ్యర్యంలో రక్త దానం.

ఉషోదయ యూత్ అధ్యర్యంలో రక్త దానం.

ఉషోదయ యూత్ అధ్యర్యంలో రక్త దానం.

కొండపాక యదార్థవాది 

దుద్దెడ గ్రామంలో ఉషోదయ యూత్ ఆధ్వర్యంలో ఆదివారం రక్తదానశిభీరాన్ని ఎర్పాటు చేశారు. జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఆరేపల్లి మహదేవ్ ప్రారంభించి స్వయంగా రక్త దానం చేసి రక్తదానం చేసిన 50 మందిని అభినందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఒకరు రక్తదానం చేస్తే నలుగురికి సహాయం చేసిన వారు అవుతారని తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఉషోదయ యూత్ ముందుకు వచ్చి రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని  గ్రామంలో యువత వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమానికి  హైదరాబాద్ కు చెందిన తలసీమియా సికిల్ సెల్ సొసైటీ సహకారం అందించగా దుద్దెడ జెడ్పి హైస్కూల్ ఆవరణలో జరిగిన ఈ రక్తదాన శిబిరాన్ని ఎర్పాటు. యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు చిలుముల రవి మాట్లాడుతూ తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ప్రతి 20 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించాల్సి ఉంటుందని అలాంటి చిన్నారులకు తమ వంతు సహాయంగా ఈ శిబిరం నిర్వహించామన్నారు. గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు అఖిల్ యాదవ్ మాజీ ఎంపీపీ అనంతుల పద్మ నరేందర్ సిద్దిపేట కపిల్ చిట్ ఫండ్స్ మేనేజర్ వెంకటరెడ్డి రక్తదానం చేశారు.  రక్తదాతలకు ఉషోదయ యూత్ అసోసియేషన్ అధ్యక్ష ఉపాధ్యక్షులు చిలుముల రవి తాడూరు చక్రవర్తి సర్టిఫికెట్లు అందించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుండెల్లి ఆంజనేయులు వార్డ్ మెంబర్ పోతుగంటి నాగరాజు మాజీ వార్డ్ మెంబర్ చిట్యాల నరసింహులు లక్మి దంపతులు ఉషోదయ యూత్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్