26.7 C
Hyderabad
Sunday, April 21, 2024
హోమ్తెలంగాణఎంపీ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు.!

ఎంపీ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు.!

ఎంపీ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.!

హైదరాబాద్: యదార్థవాది ప్రతినిది

హైదరాబాద్ నగర కమిషనర్‌కి.. ప్రత్యేకంగా ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి కత్తులతో దాడులు చేస్తున్నవారిని ఉక్కు పాదంతో అణిచివేయాలని విజ్ఞప్తి చేశారు. శాశ్వతంగా బెయిల్ రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. భారతదేశంలో బీబీసీ ప్రోగ్రాంని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ పై నిషేధించలని అసదుద్దీన్ మాట్లాడుతూ.. ”గుజరాత్ అల్లర్లలో ముఖ్యమంత్రిగా మీరే ఉన్నారు కదా! గాడ్సే గాంధీ హంతకుడు. గాడ్స్‌పైన మీ అభిప్రాయం ఏంటి? గాడ్సేపై తీయబోతున్న సినిమాని మీరు భారతదేశంలో బ్యాన్ చేస్తారా.. లేదా? మీ గురించి బీబీసీ ప్రసారం చేసిన వార్తని బ్యాన్ చేశారు.. ఈ క్రమంలోనే గాడ్సేపైతీయబోతున్న సినిమాని భారతదేశంలో 30 జనవరికి ముందు బ్యాన్ చేస్తారా లేదా? భారతదేశ పార్లమెంట్‌లో అన్ని వర్గాల ఎంపీలు ఎన్నికై వస్తారు. భారతదేశంలో ముస్లింలు ఏకతాటిపై వచ్చి రాజకీయంగా ఓ లీడర్‌షిప్ కింద ఎదగడం రాజకీయ పార్టీలకి నచ్చదు. దేశంలో ముస్లింలు రాజకీయ పార్టీలకి బానిసలుగా ఉండాలని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. 70 సంవత్సరాల నుంచి మమ్మల్ని దోచుకున్నారు. ఈ దేశంలో అగ్రకులస్తులే రాజకీయాల్లో ఉండాలని భావిస్తున్నారు. మైనార్టీ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు దళితులు ఏకితాటిపై రావడం రాజకీయ పార్టీలకి నచ్చదు” అని ప్రశ్నించారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్