ఎక్రలిక్ చిత్రాన్ని చిత్రించి ఆవిష్కరించిన రుస్తుం
యదార్థవాది ప్రతినిది సిద్దిపేట
ప్రేమికుల రోజు 14 ఫిబ్రవరి ని పురస్కరించుకుని రుస్తుం ఆర్ట్ గ్యాలరీ సిద్దిపేట లో ప్రకృతి వరం ప్రేమ ఎక్రలిక్ చిత్రాన్ని అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం సోమవారం చిత్రించి ఆవిష్కరించారు ప్రకృతి వరప్రసాదం ప్రేమ చేయకెన్నడూ దానికి నమ్మక ద్రోహం, విశ్వానికి ప్రేమే మూలం చరాచర సృష్టికి ఆధారం.మానవ మనుగడకు ప్రాణం. సహజసిద్ధమైన స్వచ్ఛమైన ప్రేమికులు అపోహలకు అతీతంగా తల్లిదండ్రులు పెద్దల సమక్షంలో పెండ్లిరోజే ప్రేమికులరోజు గా ఒక్కటవ్వాలని,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే సి ఆర్ బీదలకు పెండ్లీలు చేయిస్తున్న కళ్యాణలక్ష్మీ షాదీముబారక్ యువ జంటల స్వర్ణ తెలంగాణ ను ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రేమికులరోజు ప్రపంచంలో అందరికి స్వచ్ఛమైన ప్రేమను శాంతిని ఐక్యతను అందించాలని మానవతా చిత్రకారులు రుస్తుం ఆకాక్షించారు. ఆర్ ఎ ఎఫ్ అధ్యక్షురాలు జులేఖరుస్తుం నైరూప్య చిత్రకారుడు నహీంరుస్తుం తదితరులు పాల్గొన్నారు.