28.7 C
Hyderabad
Tuesday, June 25, 2024
హోమ్తెలంగాణఎమ్మెల్యే చిత్రపటానికి పాలభిషేకం..!

ఎమ్మెల్యే చిత్రపటానికి పాలభిషేకం..!

ఎమ్మెల్యే చిత్రపటానికి పాలభిషేకం..!

దుబ్బాక యదార్థవాది ప్రతినిది

దుబ్బాకలో వంద పడకల ఆసుపత్రిలో 71 మంది ఇబ్బంది కొరత కోసం గత అసెంబ్లీలో గలమెత్తి సమస్య తీర్చిన దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు చిత్రపటానికి స్థానిక క్యాంప్ కార్యాలయంలో పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు అంబటి బాలేష్ గౌడ్ మాట్లాడుతూ దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారం వంద పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం ఎమ్మెల్యే కృషి చేశారని సిద్దిపేట గజ్వేల్ వంద పడకల ఆసుపత్రిలో సిబ్బంది త్వరగా కేటాయించారు.. దుబ్బాక వంద పడగల ఆసుపత్రిలలో సిబ్బంది వైద్య సేవలు అందించారు అన్నారు. అంతేకాకుండా ఆస్పత్రి పనులు నత్త నడకన ఉండటంతో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సంబంధిత కాంట్రాక్ట్ తో మాట్లాడి ప్రతిగతంగా పనులను పూర్తి చేయించి ఘనత రఘునందన్ రావుకే దక్కుతుందని, ఆసుపత్రికి వెళ్లాలంటే రోడ్డు వివాదాస్పదంలో ఉంటే వారితో మాట్లాడి పనులను పూర్తి చేయించారన్నారు. అసెంబ్లీలో గలమెత్తి కోరడంతో ఇటీవల ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఆస్పత్రిలో 71 మంది వైద్య సిబ్బంది నియమించేందుకు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తిస్థాయి సిబ్బందిని నియామకం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు సుభాష్ రెడ్డి, వంశీ, మచ్చ శ్రీనివాస్, సుంకు ప్రవీణ్, గాజుల భాస్కర్, దూలం వెంకట్ గౌడ్, మరాఠీ బాబు, రమణారెడ్డి, రమేష్ రెడ్డి, నిహాల్ గౌడ్, తొగుట రవీందర్ తోపాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్