తెలంగాణలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు టిఆర్ఎస్ తన అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఏడుగురు అభ్యర్థుల పేర్లు ఖరారు అయినట్లు సమాచారం.. కడియం శ్రీహరి, సిరికొండ మధుసూదనా చారి, రవీందర్రావు, ఎల్ రమణ, ఎం సి కోటిరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, కౌశిక్ రెడ్డి పేర్లు ఉన్నాయని తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా లో కౌశిక్ రెడ్డి ని, గవర్నర్ కోటాలో గుప్తాను తీసుకోనున్నట్లు సమాచారం.