31.2 C
Hyderabad
Sunday, January 26, 2025
హోమ్ఆంధ్రప్రదేశ్ఏపీ ఉద్యోగుల సంఘం నేతకు మరోసారి నోటీసులు..

ఏపీ ఉద్యోగుల సంఘం నేతకు మరోసారి నోటీసులు..

ఏపీ ఉద్యోగుల సంఘం నేతకు మరోసారి నోటీసులు..

అమరావతి యదార్థవాది

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్‌.సూర్యనారాయణకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి నోటీసులు జారీ చేసింది.. సూర్యనారాయణ అధ్యక్షుడిగా ఉన్న ఏపీ వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది. గతంలో వాణిజ్య పన్నుల శాఖలోని ఉద్యోగుల బదిలీలకు సంబంధించి అదనపు కమిషనర్‌ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగడంపై ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కార్యాలయం వెలుపల ఉన్నతాధికారిని దిగ్భందించి ఆందోళన చేయడంపై సంజాయిషీ ఇవ్వాలని కోరింది. ప్రస్తుతం మరోమారు నోటీసులు జారీ చేస్తూ.. సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్