32.1 C
Hyderabad
Tuesday, June 25, 2024
హోమ్ఆంధ్రప్రదేశ్ఏపీ సీఐడీ కేసు.. ఆదిరెడ్డి అప్పారావు, వాసుకు హైకోర్టు బెయిల్‌..

ఏపీ సీఐడీ కేసు.. ఆదిరెడ్డి అప్పారావు, వాసుకు హైకోర్టు బెయిల్‌..

ఏపీ సీఐడీ కేసు.. ఆదిరెడ్డి అప్పారావు, వాసుకు హైకోర్టు బెయిల్‌..

అమరావతి యదార్థవాది

జగజ్జననీ చిట్‌ఫండ్‌ కేసులో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆయన తనయుడు.. తెదేపా నేత శ్రీనివాస్‌ (వాసు)కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది..రెండు రోజుల క్రితం వాదనలు ముగియగా.. తాజాగా బెయిల్‌ మంజూరు చేస్తూ ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. జగజ్జననీ చిట్‌ఫండ్ వ్యవహారంలో అప్పారావు, వాసులను ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ వారిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. చిట్‌ఫండ్‌ చట్టం ఈ కేసుకు వర్తించదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. డిపాజిట్‌ దారుల ఫిర్యాదు లేకుండానే కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. చందాదారుల సొమ్మును చట్ట విరుద్ధంగా ఇతర అవసరాలకు మళ్లించారని ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్