24.7 C
Hyderabad
Friday, June 13, 2025
హోమ్తెలంగాణఓటమిని గెలుపుకు మెట్టుగా మార్చుకోవాలి

ఓటమిని గెలుపుకు మెట్టుగా మార్చుకోవాలి

ఓటమిని గెలుపుకు మెట్టుగా మార్చుకోవాలి

సిద్దిపేట: 8 జనవరి యదార్థవాది ప్రతినిది

* క్రీడలతో మానసిక ఒతిడి తగ్గుతుంది..

* శారీరక దృఢత్వం పెరుగుతుంది..

* సచిన్ మీలో నుంచే మరెన్నో సచిన్ లు రావాలి..అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఎస్ మహేందర్..

గెలుపు ఓటములు సహజమని ఓడినవారు క్రున్గిపోవద్దని గెలిచినవారు పొంగిపోవలసిన అవసరం లేదని అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఎస్ మహేందర్ అన్నారు. సిద్ధిపేట జిల్లా పొన్నాల కృష్ణసాగర్ శివారులో ఉన్న విరాట్ ఆనంద్ క్రికెట్ అకాడమీ ద్వీతీయ వార్షికోత్సవం లో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు అన్ని రంగాలలో రాణించాలని, చదువు, క్రీడల్లో ముందంజలో ఉండాలని అన్నారు. మీలో నుండి ఎందరో సచిన్ టెండూల్కర్ లు రావాలని గొప్ప గొప్ప క్రికెటర్స్, రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలని, క్రికెట్ అకాడమీ విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. అనంతరం క్రికెట్ లో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. బెస్ట్ అల రౌండర్ బెస్ట్ బ్యాట్స్ మెన్ బెస్ట్ బౌలర్ విభాగాల్లో విద్యార్థులకు జ్ఞాపికలు అందచేశారు. తల్లిదండ్రులు కూడా విద్యార్థులను క్రీడల వైపు ప్రోత్సహించాలని, విద్యార్థినిలతో కాసేపు ఉల్లాసంగా క్రికెట్ ఆడి వారందరిని ఉత్సవపరిచారు. విద్యార్థులకు అద్భుతమైన కోచింగ్ ఇస్తున్నారని అకాడమీ కోచ్ ముత్యాల ఆనంద్ ని ప్రశంసించారు. అనంతరం మహేందర్ అకాడమీ నిర్వాహకుడు ముత్యాల ఆనంద్ , నవనీత లు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మెరిడియన్ ప్రిన్సిపాల్ రాజేందర్ రెడ్డి, పెర్క శ్రీనివాస్ జువ్వన రమేష్ అకాడమీ విద్యార్థులు పేరెంట్స్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్