ఎన్ ఫోర్స్ మెంట్ వాహనంలో చిన్నారుల తరలింపు
కంటి వెలుగుకు విద్యార్థులు
అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు
యదార్థవాది బ్యూరో సిద్దిపేట
సిద్దిపేట మున్సిపల్ కు చెందిన ఎన్ ఫోర్స్ మెంట్ వాహనంలో చిన్నారుల తరలింపుతో, ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ మేజహర్ మాలిక్ మండిపడ్డారు. బుధవారం సిద్దిపేట పట్టణంలో ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన విద్యార్థులను మున్సిపల్ వాహనంలో ఎలా తరలిస్తారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ అధికారుల పిల్లల్ని కూడా ఇలాగే తరలిస్తారా అని ప్రశ్నించారు మున్సిపల్ ఎన్ ఫోర్స్ మెంట్ వాహనాన్ని ప్లాస్టిక్ విక్రయిస్తున్న దుకాణాలపై, పుట్ పాత్ లపై ఏర్పాటు చేసిన దుకాణాలను తొలగించేందుకు ఉపయోగిస్తారని అలాంటి వాహనంలో విద్యార్థులను తరలించడం బాధాకరమని తెలిపారు. విద్యార్థులను ఎక్కడికి తీసుకెళ్తున్నారని సంబంధిత ఉపాధ్యాయురాలిని అడగగా కంటి వెలుగు కార్యక్రమానికి తీసుకెళ్తున్నట్లు చెప్పారని అన్నారు. 18 ఏళ్లకు పైబడినవారు కంటి వెలుగుకు అర్హులని ప్రభుత్వం చెబుతుందని అధికారులు మాత్రం ఎనిమిది, తొమ్మిది తరగతుల విద్యార్థినీలను కంటి వెలుగుకు ఎలా తరలిస్తారని మండిపడ్డారు. కంటి వెలుగుకు తరలిస్తున్న విషయాన్ని విద్యార్థినీల తల్లిదండ్రులకు సమాచారం అందించారా అని ప్రశ్నించారు. కంటి వెలుగు కార్యక్రమం 100% సక్సెస్ చేయాలని ఉద్దేశంతో అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడడం సిగ్గుచేటు అన్నారు. దీనిపై సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి విద్యార్థినీల తల్లిదండ్రులకు పట్టణ ప్రజలకు ఏం సమాధానం చెప్తారని మండిపడ్డారు. విద్యార్థినీలకు అనుకోని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట మైనార్టీ పట్టణ అధ్యక్షులు సయ్యద్ అతిక్. ఎన్ ఎస్ ఏ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రషద్. యూత్ కాంగ్రెస్ నాయకులు గయాజుద్దీన్ తదితరులు నాయకులు పాల్గొన్నారు