కళాకారున్ని స్మరించుదాం..

233

కళాకారున్ని స్మరించుదాం..
నిజామాాబాద్: 3 జనబరి
అరుణోదయ సాంస్కృతిక సమైక్య సంతాప సభ పోస్టర్ల పి డి ఎస్ యు ఆధ్వర్యంలో విడుదల చేశారు. అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ సుబ్బారావు విప్లవ జోహార్లు అర్పిస్తూ మంగళవారం ఆర్మూర్ లోని కుమార్ నారాయణ భవనం పి డి ఎస్ యు, పి వై ఎల్, పిఓడబ్ల్యు, ప్రతినిధులు పోస్టర్ల విడుదల చేశారు. ఈ సందర్భంగా బి,దేవరం మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం కమ్యూనిస్టులు ఉద్యమానికి, విప్లవోద్యమానికి సుబ్బారావు ఉద్యమానికి ప్రభావితుడై నాలుగు దశాబ్దాలుగా సాంస్కృతిక సైనికుడిగా, అరుణోదయ సాంస్కృతిక సమైక్యలో ప్రధానంగా పనిచేస్తూ సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా పార్టీ పోరు బాటలో నడిచాడు, కళాకారుడిగా, రచయితగా, ఎదిగి భూ, రైతాంగ, విద్యాహక్కు, మహిళ హక్కు కొరకు తన పాట, కలాన్ని, గలంతో చైతన్య పరిచారు. అరుణోదయ నాయకులు అనిల్ కుమార్ మాట్లాడుతూ అసమానతలు, దౌర్జన్యాలను తన పాటతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎత్తిచూపరని, కామ్రేడ్ సుబ్బారావు సంతాప సభలను కలిసికట్టుగా జయప్రదం చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కిషన్, డివిజన్ నాయకులు నరేందర్, పద్మక్క. నిఖిల్, వంశీ, మనోజ్, వినోద్, తదితరులు పాల్గొన్నారు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి