కాంగ్రెస్ తోనే గల్లీ నుంచి ఢిల్లీ దాకా అభివృద్ధి సాధ్యం: మాజీ ఎంపి పొన్నం
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది
హుస్నాబాద్ నియోజకవర్గంలో
ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్.. నియోజకవర్గంలోని సైదాపూర్ మండలం గోడిశాలలో కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ గతంలో కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి మాత్రమే..గల్లీ నుంచి ఢిల్లీ దాకా అభివృద్ధి సాధించిన ఘనత కాంగ్రెస్ పార్టీ దే ఇందిరమ్మ ఇల్లు కట్టించి, రోడ్లు వేయించిన ఘనత కాంగ్రెస్ మత్రమే.. పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమాత్రం అభివృద్ధి చేయలేదని, స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఏనాడు కూడా అసెంబ్లీలో హుస్నాబాదు నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడిన పాపాన పోలేదని, నాకు పదవి ఉంటే సరిపోతుంది లే అనే చందంగా వ్యవహరిస్తున్నాడని ఆయన తెలిపారు. నేడు కల్లబొల్లి మాటలతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని ఆయన చేసిన అభివృద్ధి ఏంటో నియోజకవర్గంలో ఎక్కడ చూసినా నాటి అభివృద్ధి తప్ప.. నేటి అభివృద్ధి కనబడటం లేదని అన్నారు.