యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో నేటి నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం. హరిహరులకు అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసం నేటి నుండి మొదలవుతుంది . కార్తీక మాసం సందర్భంగా యాదాద్రిలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. యాదాద్రిలో దోపోత్సవాలతో పాటు సత్యనారాయణ స్వామి వ్రతాలు కోసం భక్తులు తరలివస్తారని .. అందుకు తగినట్లుగా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నేటి నుండి నెల రోజులపాటు నిత్యం ఆరు దఫాలుగా సత్యనారాయణ వ్రతాలు జరగనున్నాయి. ప్రస్తుతం రోజూ నాలుగు సార్లు మాత్రమే వ్రతాలు జరుగుతున్న కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మరో రెండుసార్లు అదనంగా మొత్తం ఆరుసార్లు సత్యనారాయణ వ్రతాలు జరుగనున్నాయి. ఉదయం 6.30 గంటల నుంచి ప్రతి రెండు గంటల కోసారి సాయంతం 5.30 వరకు వ్రతాలు కొనసాగుతాయి. కార్తీక పౌర్ణమి రోజున ప్రత్యేక కార్యక్రమాలు జరుగును.