24.7 C
Hyderabad
Thursday, June 13, 2024
హోమ్తెలంగాణకార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా వుంటుంది..

కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా వుంటుంది..

కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా వుంటుంది..

దుబ్బాక యదార్థవాది ప్రతినిది

గ్రామ పంచాయతిలలో పని చేస్తున్న పారిశుద్ధ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని చేస్తున్న సమ్మెకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ దుబ్బాక ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 27 రోజులుగా కార్మికుల వేతనాల పెంపు పర్మినెంట్ చేయాలని, కారోబార్ బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలని రాష్ట్రవ్యాప్తంగా సమ్మె కొనసాగిస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. జీవో నెంబర్ 60 ప్రకారం జీతాలు ప్రమోషన్లు ఇవ్వాల్సి ఉన్న కెసిఆర్ ప్రభుత్వం ఇవ్వడం లేదని తెలంగాణ వస్తే ధర్నాలు రాస్తారోకో లు లేవని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా రాస్తారోకోలు ధర్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తీర్చాలని లేనిపక్షంలో కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉండి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మికులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్