32.2 C
Hyderabad
Sunday, June 23, 2024
హోమ్తెలంగాణకార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిఘటిద్దాం!

కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిఘటిద్దాం!

కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిఘటిద్దాం!

సిద్దిపేట యదార్థవాది

క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా విశాల ఐక్య పోరాటాలకు సన్నద్ధం కావాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి బీరం మల్లేశం కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో అదివారం కార్మిక సంఘాల జిల్లా సదస్సు సిఐటియు, జిల్లా కార్యదర్శి కాముని గోపాలస్వామి, ఏఐటీయూసి జిల్లా అధ్యక్షుడు రంగారెడ్డి, హెచ్ఎంఎస్ జిల్లా అధ్యక్షుడు ఈదరి మల్లేశం ల అధ్యక్షతన జరగగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి బీరం మల్లేశం వక్తలుగా ఏ ఐ టి యు సి జిల్లా కార్యదర్శి కిష్టపురం లక్ష్మణ్, హెచ్ ఎం స్ జిల్లా కార్యదర్శి జి మధు పాల్గొని మాట్లాడుతూ…. నరేంద్ర మోదీ నాయకత్వంలోని కార్పొరేట్ అనుకూల కేంద్ర బిజెపి ప్రభుత్వం బరితెగించి ప్రజా, కార్మిక వ్యతిరేక పరిపాలన సాగిస్తున్నది. జాతీయ సహజ వనరులు, ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా స్వదేశీ, విదేశీ కార్పోరేట్లకు అమ్మేస్తున్నది. డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్, ఇతర నిత్యావసర సరుకుల ధరలు పెంచి ప్రజల నడ్డివిరిచింది.ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలపై ఉక్కుపాదం మోపింది. రాజ్యాంగ బద్ధంగా పౌరులకున్న ప్రాథమిక హక్కులకు సైతం పాతరేస్తున్నది. ఉపాధి, నిరుద్యోగం, అధిక ధరలు, ఆకలి, అసమానతలు, ఆరోగ్య రక్షణ లాంటి ప్రాథమిక సమస్యలను పట్టించుకోకపోగా,
స్వాతంత్య్రానంతరం దేశ ప్రజానీకం ఎంతో శ్రమించి అభివృద్ధి చేసుకున్న ప్రభుత్వరంగ మౌలిక వసతులు, సహజ వనరులను కార్పొరేట్లు లూఠీ చేసే విధానపర నిర్ణయాలను కేంద్రం అమలు చేస్తున్నది. వ్యూహాత్మక అమ్మకాల పేరుతో ప్రభుత్వరంగ • సంస్థల్లో 100 శాతం వాటాలు తెగనమ్ముతున్నది. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ (ఎన్ఎంపి) పాలసీ ద్వారా మౌలిక వసతులను లీజు పేరుతో ధారాదత్తం చేస్తున్నది. జాతీయ రహదారులు, రైళ్ళు, విద్యుత్ స్టేషన్లు, ట్రాన్సిమిషన్, చమురు-సహజ వాయివు పైప్ లైన్లు, బొగ్గు గనులు, టెలికం టవర్లు, విమానాశ్రయాలు, ఓడరేవులు, ఎఫ్.సి.ఐ గోడౌన్లు, క్రీడా మైదానాలతో సహా ప్రజా ఆస్తులన్నింటిని కార్పొరేట్లకు అమ్మేస్తుంది. దీని వల్ల రాబోయే కాలంలో ప్రజలు ఈ సౌకర్యాల కోసం వేలాది రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగుల కష్టార్జితమైన పిఎఫ్, పెన్షన్ నిధులను ప్రైవేట్ ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు అప్పజెప్తున్నది. మన రాష్ట్రంలో సింగరేణిలోని 4 బొగ్గు గనులను వేలం వేసింది. హైదరాబాద్లో కేంద్రీకృతమై వున్న బిడిఎల్, బిఇఎల్, బిహెచ్ఐఎల్, హెచ్ఎఎల్, మిథాని లాంటి సంస్థలలో సుమారు 25 నుండి 50 శాతం దాకా వాటాలు అమ్మేసింది. కార్మికులు, మధ్యతరగతిలో అత్యధికులు పాలసీదార్లుగా వున్న ఎల్బీసిలో లక్ష కోట్ల రూపాయల వాటాలు అమ్మేందుకు తెగబడింది.
అనేక త్యాగాలు, రక్త తర్పణతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లు మారుస్తూ పార్లమెంట్ లో చట్టం చేసింది. వేతనాల కోడ్ చట్టంతో కనీస వేతనాలు నిర్ణయించే మౌలిక విధానానికి మంగళం పాడింది. పారిశ్రామిక సంబంధాల కోడ్ చట్టంతో సమ్మె హక్కును కాలరాస్తున్నది. సామాజిక భద్రతా కోడ్, వృత్తి సంబంధిత రక్షణ, ఆరోగ్యం- పని పరిస్థితుల కోడ్లతో పిఎఫ్, ఇఎస్ఐ, వెల్ఫేర్ బోర్డులపై గొడ్డలి వేటు వేస్తున్నది. తిరిగి 12 గంటల పని విధానం అమల్లోకి తెస్తున్నది. ఇలాంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై రాబోయే కాలంలో మరింత ఉధృతంగా పోరాటాలు నిర్వహించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు ఈ సదస్సులో సిఐటియు జిల్లా అధ్యక్షుడు సంద బోయిన ఎల్లయ్య, జిల్లా ఉపాధ్యక్షులు దాసరి కళావతి, ఎం పద్మ, బండ్ల స్వామి, జిల్లా సహాయ కార్యదర్శి లు చొప్పరి రవికుమార్, తునికి మహేష్ లు జిల్లా కమిటీ సభ్యులు ఎన్.వేణుగోపాల్, మామిడాల కనకయ్య,ఎస్.రంగారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు అందే అశోక్, జిల్లా సహాయ కార్యదర్శి బెక్కంటి సంపత్, జిల్లా కోశాధికారి జి నర్సింలు హెచ్ఎంఎస్ జిల్లా నాయకులు ఇదారి లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్