కుల వివక్షకు మూలం మనుధర్మమే.
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిధి
భిన్న సంస్కృతి సంప్రదాయాలు కలిగిన భారతదేశంలో కుల వివక్షకు సామాజిక అసమానతలకు మనుధర్మ శాస్త్రవే మూల కారణమని దళిత సంఘాల నాయకులు మండిపడ్డారు.
భారతదేశ వెనుకబాటు తనానికి మనుస్మృతియే ప్రధాన కారణమని డా. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతిఘటించి డిసెంబర్ 25న మనుస్మృతిని దహనం చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో దళిత బహుజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం మనుస్మృతి దహన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కేడం లింగమూర్తి మాట్లాడుతూ మనువు చెప్పిన సూత్రాలన్నీ పేద ప్రజలను, మహిళలను తీవ్రంగా అవమానించే లాగా ఉన్నాయని అన్నారు. అందుకే ప్రజలందరూ మనుధర్మాన్ని వీడి, ప్రజాస్వామిక ఆలోచన విధానంతో ముందుకు సాగాలని అన్నారు. సర్వ సమానత్వం సాధించాలంటే భారత రాజ్యాంగం పూర్తిస్థాయిలో అమలు కావాలని అదొక్కటే మనందరికీ శరణ్యమని అన్నారు. అనంతరం మనుస్మృతిని దహనం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కేడం లింగమూర్తి, ముక్కెర సంపత్ కుమార్, బంక చందు, వెన్న రాజు, ఎనగందుల శంకర్, గొర్ల ఐలేష్ యాదవ్, భూక్య సరోజన, పోతుగంటి బాలయ్య, గుగులోతు రాజు నాయక్, పొన్నాల వినోద్ కుమార్, గాలి పెళ్లి శ్రీనివాస్, భువనగిరి రజిత, కొండ్ర రమాదేవి, బోయిని కమల, జేరుపోతుల సంజీవ్ బోయిని రాజ మల్లయ్య లావుడ్యా బిక్య నాయక్ బెజ్జంకి బాబు తుమ్మ రాజారాం రుద్రారపు శరత్ బాబు బోయిని కొమురయ్య బత్తుల రవి రామగిరి కుమారస్వామి బండారి అజిత్ సావుల మధు బదనపురం నరసయ్య తదితరులు పాల్గొన్నారు