35.2 C
Hyderabad
Friday, April 19, 2024
హోమ్తెలంగాణకూడవెల్లి వాగులోకి నీటిని విడుదల చేసిన ఎంపీ

కూడవెల్లి వాగులోకి నీటిని విడుదల చేసిన ఎంపీ

కూడవెల్లి, హల్దివాగులోకి గోదావరి జలాలను విడుదల చేసిన మెదక్ ఎం పీ కొత్త ప్రభాకర్ రెడ్డి

యదార్థవాది ప్రతినిధి గజ్వెల్

సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గజ్వెల్ నియోజకవర్గంలో జడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎఫ్దీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి తో కలిసి.  కొడకండ్ల వద్ద మల్లన్నసాగర్ జలాలను కూడవెళ్లి వాగులోకి, వర్గల్ వద్ద కొండపోచమ్మ సాగర్ జలాలను హల్ది వాగు లోకి ఎంపీ విడుదల చేశారు ఈసందర్భంగా గంగమ్మ కు ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడుతూ కూడవెల్లి, హల్దివాగు పరివాహ ప్రాంతాల పరిధిలో నేడు పెద్ద ఎత్తున పంట పొలాలు సాగు చేయడం జరిగిందన్నారు నేడు వాగుల్లో పంట పొలాలు ఎండిపోయే అవకాశం ఉండటంతో రైతుల విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆదేశాల మేరకు శుకరవారం నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు..నీటి విడుదల మూలంగా..వేలాది ఎకరాల పంట పొలాలకు మేలు నాడు ప్రాజెక్టులు నిర్మిస్తుంటే..తమకు ఉనికి ఉండదని.చెప్పరాని కుట్రలు చేయడం జిల్లా కోర్టు నుండి మొదలు కొని సుప్రీంకోర్టు వరకు..కేసులు వేశారన్నారు నేడు ప్రాజెక్టుల నిర్మాణంతోనే..నీటిని విడుదల చేసుకుంటున్నామని ఆయన తెలిపారు ఈ సందర్భంగా తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి నాగలితో ఎంపీ ని సన్మానించారు..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్