27.7 C
Hyderabad
Thursday, April 11, 2024
హోమ్తెలంగాణకైకాల సత్యనారాయణ ప్రస్థానం..

కైకాల సత్యనారాయణ ప్రస్థానం..

కైకాల సత్యనారాయణ ప్రస్థానం..

హైదరాబాదు (డిసెంబర్23)

మరో సినీ దిగ్గజం భువినుండి దివికి ఎగిసింది.. సీనియర్‌ నటుడు..
కైకాల సత్యనారాయణ శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.. సినీ నటుడిగానే కాదు.. పార్లమెంట్‌ సభ్యుడిగా ఆయన సేవలు అందించారు.. తన 60 సంవత్సరాల సినీజీవితంలో 777 సినిమాల్లో నటించారు.. ఒక నటుడిగా అతను పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు పోషించారు.. హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో పోషించాడు. తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా అతను నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు పొందాడు. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్వీ రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన వారిలో కైకాల ఒకరు.. 1959లో సిపాయి కూతురు అనే చిత్రంతో సినీరంగప్రవేశం చేసిన కైకాలకు సంబంధించిన ప్రస్థానంలోకి వెళ్తే.. కృష్ణా జిల్లా బంటుమిల్లి గ్రామంలో 1935 జులై 25న జన్మించారు కైకాల సత్యనారాయణ.. గుడివాడ కళాశాల నుంచి పట్టభద్రుడైన ఆయన.. 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మను వివాహం చేసుకున్నారు.. కైకాలకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు.. తన మనవళ్లలో ఒకరిని నటవారసుడిగా చూడాలనేది కైకాల కోరిక.. నవరస నటనా సార్వభౌముడిగా ప్రఖ్యాతిగాంచిన కైకాల.. ఐదు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో తన ప్రయాణాన్ని కొనసాగించారు.. 777 చిత్రాల్లో నటించి మెప్పించారు.. కైకాల సత్యనారాయణ నటించిన మొదటి చిత్రం సిపాయి కూతురు కాగా.. ఆయన నటించిన చివరి చిత్రం సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు నటించిన మహర్షి.. పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద చిత్రాల్లోఎన్నో పాత్రలు పోషించిన కైకాల.. 28 పౌరాణిక, 51 జానపద, 9 చారిత్రక చిత్రాల్లో నటించారు.. 200 మందికిపైగా దర్శకులతో పనిచేశారు. 100 రోజులు ఆడిన కైకాల నటించిన చిత్రాలు 223 ఉన్నాయి.. అర్ధశతదినోత్సవాలు జరుపుకున్న సినిమాలు 59.. సంవత్సరం ఆడిన చిత్రాలు 10 ఉన్నాయి.. ఇంటర్ రెండో సంవత్సరంలో నాటకరంగంలో ప్రవేశం చేశారు కైకాల.. నాటకరంగ అనుభవంతో సినిమాల్లో వేషం కోసం మద్రాసు వెళ్లిన ఆయనకు నటుడిగా గుర్తించారు డి.ఎల్.నారాయణ.. తొలి సినిమాతోనే కథానాయకుడి అవకాశాన్ని అందుకున్న కైకాల.. సిపాయి కూతురు చిత్రంతో కథానాయకుడిగా తెరకు పరిచయం అయ్యారు.. కైకాలకు ఎన్టీఆర్ పోలికలు కలిసివచ్చాయి.. కైకాలను ఎన్టీఆర్ కు నకలుగా భావించారు పరిశ్రమ పెద్దలు.. సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి చిత్రంలో తొలిసారిగా ఎన్టీఆర్ తో కలిసి తెరను పంచుకున్నారు.. విఠలాచార్య దర్శకత్వంలో తొలి ప్రతినాయకుడి వేషం వేసిన కైకాల.. కనకదుర్గ పూజ మహిమ చిత్రంలో తొలిసారి ప్రతినాయకుడి పాత్ర పోషించారు. అయితే, ఎన్టీఆర్ అగ్గిపిడుగు చిత్రంతో కైకాల సినీ జీవితం మలుపుతిరిగింది.. ఎన్టీఆర్ తో కలిసి 101 చిత్రాల్లో నటించారు.. ఎన్టీఆర్ తో పోరాట సన్నివేశాల్లో పోటాపోటీగానటించి మెప్పించారు కైకాల. యమగోల, యమలీల చిత్రాల్లో యముడిగా అలరించారు కైకాల .. పౌరాణికాల్లో రావణుడు, దుర్యోధనుడు, యముడు, ఘటోత్కచుడు పాత్రల్లో ఆయన జీవించారు.. సాంఘిక చిత్రాల్లో రౌడీ, తండ్రి, తాత పాత్రల్లో నటించి మెప్పించారు. రమా ఫిల్మ్ ప్రొడక్షన్ సంస్థను స్థాపించిన కైకాల.. కొదమ సింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు లాంటి చిత్రాలను నిర్మించారు.. 1994లో బంగారు కుటుంబం చిత్రానికి నంది పురస్కారం అందుకున్నారు. 2011లో రఘుపతి వెంకయ్య పురస్కారంతో ఆయనను సత్కరించారు.. ఇక, 1996లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కైకాల సత్యనారాయణ.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు.. తొలి రోజుల్లో ”రాముడు-భీముడు’ వంటిఎన్.టి.ఆర్. ద్విపాత్రాభినయ చిత్రాలలో ఆయనకు డూప్ గా నటించారు.. కైకాల మృతితో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.. సినీ, రాజకీయ ప్రముఖులు.. ఆయనకు నివాళులర్పిస్తున్నారు.. కైకాలతో వారికి ఉన్నఅనుబంధాన్నిగుర్తుచేసుకుంటున్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్