గుంటూరు జిల్లా సత్తెనపల్లి లో తెలుగుదేశం పార్టీ నేత కోడెల శివరాం ను హౌస్ అరెస్టు చేశారు. ఆయన ఇంటి దగ్గర పోలీసులు భారీగా మొహరించారు. చంద్రన్న ఆ ఆశయ సాధన పేరిట శనివారం పాదయాత్ర చేసేందుకు కోడెల శివరాం సిద్ధమయ్యారు. అయితే పాదయాత్ర కు అనుమతి లేదని పోలీసులు చెప్తుండగా పాదయాత్ర చేసి తీరుతానని శివరాం స్పష్టం చేశారు. కాగా పలువురు టిడిపి నేతల ఇళ్ల వద్ద కూడా పోలీసులు మోహరించి ఉన్నారు