హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల సందర్భంగా పలు ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి వీణవంక మండలం కనుముక్కల లో పోలింగ్ కేంద్రానికి వచ్చిన టిఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి బీజేపీ శ్రేణులు అడ్డుకున్నారు స్థానికేతరులు ఎందుకు వచ్చారు అని నిలదీశారు టిఆర్ఎస్కు ఓటు వేయాలని ఓటర్లను ఒత్తిడి చేస్తున్నారని కౌశిక్ రెడ్డి తో గొడవకు దిగారు ఈ క్రమంలో టిఆర్ఎస్ బిజెపి వర్గాల మధ్య గొడవ జరిగింది ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.