గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలి..సీపీఐ

282

గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలి..సీపీఐ

సిద్దిపేట 29 డిసంబర్

గవర్నర్ వ్యవస్థను రద్దు చేసేంత వరకు ఊరుకోం..

సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన సిద్దిపేట కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తత..

కలెక్టర్ లోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేసిన సీపీఐ నాయకులు..

సీపీఐ నాయకులను పోలీస్ స్టేషన్ తరలింపు..

బారత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య వ్యవస్థను విధ్వంసం చేస్తూ, రాజ్యాంగేతర శక్తిగా మారిన గవర్నర్ వ్యవస్థను రద్దు చేసేంత వరకు ఉద్యమిస్తామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు..భారత కమ్యూనిస్టు పార్టీ సిద్దిపేట జిల్లా ఆధ్వర్యంలో గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని గురువారం సిద్దిపేట కలెక్టరేట్ ముట్టడి నిర్వహించారు.. సీపీఐ నాయకులు కలెక్టరేట్ గేట్లు ఎక్కి లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులకు,నాయకులకు మధ్య తోపులాట జరిగింది… చాడ వెంకటరెడ్డి,మంద పవన్ ను అరెస్ట్ చేసిన త్రీ టౌన్ పోలీసు స్టేషన్అధికారులు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ బీజేపీ యేతర రాష్ట్రాల్లో గవర్నర్ లు కేంద్ర ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తూ, ఆయ ముఖ్యమంత్రులు పంపిన జివోలను, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని , గవర్నర్ రాజ్యాంగ బద్దంగా పని చేయాలని, రాష్ట్రాల అభివృద్ధి లో ముఖ్యమంత్రులతో కలిసి పని చేయాలన్నారు..గవర్నర్ వ్యవస్థ ను కేంద్రం ఏజెంట్ గా మార్చుకుని, ప్రభుత్వ సంస్థలు అయిన ఈడి,ఐటీ, సీబీఐ ని తమ గుప్పిట్లో పెట్టుకుని బీజేపీ ఏతర నాయకులను టార్గెట్ చేస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆటంకంగా మారిందని అన్నారు. గవర్నర్ వ్యవస్థ ను రద్దు చేసేంత వరకు సీపీఐ పార్టీ ఉద్యమిస్తుందని ఆయన హెచ్చరించారు..ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మందపవన్, కార్యవర్గ సభ్యులు గడిపే మల్లేష్,వేల్పుల బాలమల్లు,కిష్టపురం లక్ష్మణ్,కనుకుంట్ల శంకర్,యెడల వనేశ్,అందే అశోక్,జిల్లా కౌన్సిల్ సభ్యులు కొమ్ముల భాస్కర్,జేరిపోతుల జనార్ధన్,పార్టీ,ప్రజా సంఘాల నాయకులు బెక్కంటి సంపత్,వేల్పుల శ్రీనివాస్,సంగెం మధు,రామగళ్ల నరేష్,మిట్టపల్లి సుధాకర్,మాడిశెట్టి శ్రీధర్,కర్నాల చంద్రం,మల్లేశం,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు..

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి