గూడ మల్లారెడ్డి స్మారకార్ధం క్రీడలు.
గజ్వేల్ యదార్థవాది ప్రతినిధి
కొండపాక మండల పరిదిలోని వెలికట్ట గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ గూడ మల్లారెడ్డి ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఆయన భార్య గూడ సరోజనమ్మ కోడళ్ళు కుమారులు గూడ వనజాక్షి నరేందర్ రెడ్డి గూడ జ్యోతి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో క్రీడా కార్యక్రమాలు నిర్వహించడం కోసం స్థానిక స్కూల్లో బుధవారం జ్యోతి ప్రజ్వాలన చేసారు. ఉమ్మడి వెలికట్ట గ్రామ స్థాయిలో నిర్వహించే ఈఆటల పోటిల్లో భాగంగా గురువారం రోజు క్రికెట్ పోటీ నిర్వహించి శనివారం స్త్రీలకు ముగ్గులపోటీలు పెడతామని ఆర్గనైజర్లు విజ్జగిరి ప్రభాకర్ దొబ్బ రాజు తెలిపారు. కార్యక్రమంలో వెలికట్ట గ్రామ సర్పంచ్ అమ్ముల రమేష్ రవీంద్ర నగర్ విశ్వనాథపల్లి సర్పంచ్ వాసరి లింగారావు పిఎసిఎస్ డైరెక్టర్ బూర్గుల సురేందర్ రావు పురుషోత్తం పటేల్ వార్డ్ సభ్యులు కోడెల యాదగిరి నాంపల్లి యాదయ్య షాబద్దీన్ దత్తు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జగన్నాథ్ రెడ్డి ఉపాధ్యాయ బృందం విద్య కమిటీ చైర్మన్ సింగపాక రాజు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.