గ్రామాల్లోనే రిజిస్ట్రేషన్ల ఈ విధానంతో మేలు తక్కెళ్ళపాడు లో ప్రారంభించిన ప్రభుత్వం

297

భూములు ఇండ్లు ఫ్లాట్లు తదితర స్థిరాస్తులు క్రయ విక్రయాలు అంటే ఎంతో క్రేజ్ ఈ భూముల క్రయ విక్రయాల్లో మధ్యవర్తులు ఇతరులు జోక్యం చేసుకుంటారు. కొనుగోలుదారులు విక్రయదారులు కలిసి దస్తావేజులు రాసే వారిని ఆశ్రయిస్తారు ఇక వారు చెప్పిన విధంగా గా కమిషన్ రిజిస్ట్రేషన్ ఫీజు తదితరాలు చేస్తారు. డబుల్ రిజిస్ట్రేషన్ లు వివాదాస్పద భూములు ప్రభుత్వ భూములు తదితరాలను సైతం రిజిస్ట్రేషన్ చేసి ఎక్కువ మొత్తంలో డబ్బు గుంజుతారు ఇలా చేసిన తర్వాత వివాదాస్పదమై తే మీరు మీరు చూసుకోండి ఇ మధ్యలో మాకేంటి అని అనుకుంటారు. ఇలాంటి వివాదాలకు కాస్తయినా జరగకుండా చూసేందుకు గ్రామ సచివాలయం లోనే రిజిస్ట్రేషన్ చేసే విధానం సత్ఫలితాలను ఇవ్వనుందని చెప్పక తప్పదు. ఇందుకోసం పైలెట్ ప్రాజెక్టుగా కృష్ణా జిల్లాలను ఎంపిక చేసి చూస్తున్నారు. ఈ నెలలో ఇప్పటి వరకు నాలుగు రిజిస్ట్రేషన్లు పూర్తిచేశారు వచ్చే నెల నుంచి జిల్లాలో మరో నాలుగు గ్రామాలను ఎంపిక చేసి ఇ ఈ విధానం చేపడతారు ఇప్పటికే జగ్గయ్యపేట మండలం తక్కెళ్ళపాడు లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది జిల్లాలో ప్రస్తుతామ్ ఆస్తుల రిజిస్ట్రేషన్లు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే జరుగుతాయి. ప్రభుత్వ భూముల విలువ ప్రకారం రిజిస్ట్రేషన్ చేస్తారు. కానీ ప్రస్తుతం ఎనీవేర్ విధానం అమలులో ఉండటంతో ఆస్తులను ఎక్కడినుంచైనా రిజిస్ట్రేషన్ చేస్తారు. కానీ గ్రామ సచివాలయం లో మాత్రం ఆ గ్రామానికి చెందిన ఆస్తులు మాత్రమే రిజిస్ట్రేషన్ అవుతాయి ఎనీ వేర్ విధానం ఇక్కడ అమలు కాదు. దీనివల్ల తప్పుడు రిజిస్ట్రేషన్ జరిగే అవకాశం తగ్గుతుంది. గ్రామంలోనే కాబట్టి క్రయ విక్రయదారులు అంతా తెలిసిన వారే ఉంటారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి