గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి.
-భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ డిమాండ్.
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది
నిరంతరం గ్రామీణ ప్రాంతాల్లో చాలి చాలని జీతాలతో ఏండ్ల తరబడి గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్నా పారుశుద్య కార్మికుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని గత పది రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉన్నట్లు ఉందని గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం చూపకుండా నిర్లక్ష్యం చేయడం కెసిఆర్ ప్రభుత్వానికి తగదని తక్షణమే ముఖ్యమంత్రి చొరవ తీసుకొని కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని భారత జాతీయ మహిళా సమాఖ్య సిద్దిపేట జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్. శనివారం హుస్నాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట చేస్తున్న రిలే నిరాహారదీక్ష చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులకు సంఘీభావం తెలిపారు..కార్యక్రమంలో భారత జాతీయ మహిళా మండల సమాఖ్య నాయకురాల్లు నేలవేని స్వప్న,పెద్ది నిర్మల గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.