32.2 C
Hyderabad
Friday, February 7, 2025
హోమ్తెలంగాణఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాలు

ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాలు

ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాలు

యదార్థవాది సిద్దిపేట ప్రతినిది

జిల్లా కేంద్రంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతి ఉత్సవాలను జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ, మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గ్ రాజనర్సు, కౌన్సిలర్లు, జిల్లా అధికారులు, పద్మశాలీలు అధిక సంఖ్యలో పాల్గొని కొండా లక్ష్మణ్ బాపూజీకి కాంస్య విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జెడ్పి చైర్ పర్సన్ రోజా శర్మ మాట్లాడుతూ బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ బాటలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తుందని, స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు అని తెలిపారు. మలిదశ ఉద్యమంలో కేసీఆర్ బాసటగా నిలిచి తన జలదృశ్యాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయానికి ఇచ్చారని గుర్తు చేశారు. నాడు వివిధ హోదాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితాంతం బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పరితపించారని మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్ అన్నారు. రాష్ట్ర సిద్ధించిన అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించి వారి జయంతి, వర్ధంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట పద్మశాలి సంఘం నేతలు మల్లికార్జున్, రవితేజ, భాస్కర్, కోటి, బిక్షపతి, వెంకన్న, రాము, మధు, శ్రీనివాస్, దయాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్