29.2 C
Hyderabad
Sunday, February 9, 2025
హోమ్తెలంగాణఘనంగా బోనాల పండుగ..

ఘనంగా బోనాల పండుగ..

ఘనంగా బోనాల పండుగ..

-ఆకట్టుకున్న పోతురాజుల నృత్యాలు

హుస్నాబాద్ యదార్థవాది

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని సివి రామన్ ఉన్నత పాఠశాలలో పోచమ్మ బోనాలను సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన బోనాలు, పోతురాజుల నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. బోనాల పండుగ తెలంగాణ రాష్ట్ర పండుగని, 18వ శతాబ్దంలో హైదరాబాద్ లో ప్లేగు వ్యాధితో అనేకమంది ప్రజలు చనిపోయారని, అప్పుడు అమ్మవారికి బోనాలు చేస్తామని ప్రజలు మొక్కుబడి చేసుకొని అప్పటినుండి బోనాలు చేస్తున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ప్రతి హిందువు జరుపుకోవాల్సిన పండుగ బోనాల పండుగ అని, ఈ పండుగను తమ పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పద్మ, గూడు కిరణ్, వెంకటేశ్వర్లు, రమేష్, ప్రీతి ,భాస్కర్, ప్రియాంక, వర్ణమాల, మమత, శివ, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్