ఘనంగా వాసవి మాతకు మహా అభిషేకం
సూర్యాపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 29: జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాలను పురస్కరించుకొని బుధవారం దేవాలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంపై శ్రీ వాసవి మాత ఉత్సవ విగ్రహానికి వివిధ రకాల పండ్ల రసాలతో ఘనంగా అభిషేకము నిర్వహించారు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అభిషేక కార్యక్రమంలో పాల్గొని భక్తిపారవశంతో కొంతమంది భక్తులు పూనకాలతో ఊగిపోయారు. అంతకుముందు 108 కలశాలతో పంచామృతాలతో పట్టణంలో పెద్ద ఎత్తున మహిళలు వాసవి మాత మాల ధారణ స్వాములు కోలాటాలతో ఊరేగింపుగా శోభయాత్ర నిర్వహించి అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో వాసవి దేవాలయ ప్రాంగణం ఆధ్యాత్మికశోభ సంతరించుకుంది. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన కార్యదర్శి ఈగ వెంకటేశ్వర్లు, వాసవి మాలాధారణ నిర్వాహకులు పబ్బతి వేణుమాధవ్, కల కోట లక్ష్మయ్య మాట్లాడుతూ నేడు గురువారం సాయంత్రం మూడు గంటలకు వాసవి దేవాలయం నుండి బెంగళూరుకు చెందిన రాండోల్ బృందం తో పాటు, కోలాటాలతో పెద్ద ఎత్తున సూర్యాపేటలో మొట్టమొదటిసారిగా కానీ విని ఎరుగని రీతిలో శోభయాత్ర నిర్వహిస్తున్నట్లు భక్తులు పెద్ద ఎత్తున శోభయాత్రలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలన్నారు. ఈనెల 31న వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక అభిషేకం తో పాటు హోమం, ఒడిబియ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, సింగిరి కొండ రవీందర్ ,తోట శ్యాంప్రసాద్, పోలా రాధాకృష్ణ, వెంపటి శబరినాథ్,ఈగ దయాకర్, బిక్కుమల్ల కృష్ణ, నూక రవిశంకర్, మంచాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.