30.2 C
Hyderabad
Saturday, January 25, 2025
హోమ్తెలంగాణఘనంగా సహస్ర గళ గీతార్చన

ఘనంగా సహస్ర గళ గీతార్చన

ఘనంగా సహస్ర గళ గీతార్చన

సూర్యాపేట, యదార్థవాది ప్రతినిధి,  డిసెంబర్ 15: గీతా జయంతిని పురస్కరించుకుని దేవాలయాలు ధార్మిక సంస్థల ఐక్యవేదిక ఆధ్వర్యంలో  ఆదివారం స్థానిక రవి మహల్ ఫంక్షన్ హాల్ నందు వెయ్యి మంది భక్తులచే సామూహిక గీతా పారాయణం సహస్ర గళ గీతార్చన ఘనంగా జరిగింది. గత సోమవారం నుండి శనివారం వరకు వివిధ దేవాలయాల్లో సామూహిక భగవద్గీత పారాయణాలు నిర్వహిస్తూ ముగింపుగా జరిగిన ఈ ఉత్సవంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవనాథ జీయర్ స్వామి అనుగ్రహ భాషణ మిస్తూ సర్వమానవాళికి దిశా నిర్దేశం చేస్తూ మానవజాతి సర్వతోముఖాభివృద్ధికి కులమతాలతో సంబంధం లేకుండా ప్రబోధించిన గొప్ప తత్వ గ్రంథమే భగవద్గీత అన్నారు అంతటి పరమోత్కృష్టమైన భగవద్గీతను ప్రతి ఒక్కరూ విధిగా ఇంట్లో ఉంచుకొని అధ్యయనం చేయవలసిందిగా కోరారు. ఐక్యవేదిక అధ్యక్షులు నల్లాన్ చక్రవర్తుల  వేణుగోపాలాచార్యులు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించబడి, దేవనాథ జీయర్ స్వామి వారిచే సామూహిక గీతా పారాయణం జరిగింది అనంతరం జిల్లా స్థాయిలో నిర్వహించిన భగవద్గీత కంఠస్థ పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక కన్వీనర్లు నాగవల్లి ప్రభాకర్ పర్వతం శ్రీధర్ కుమార్, ముఖ్య అతిధి కర్నాటి రవి, బ్రహ్మ దేవర సోమయ్య మురళీధరాచార్యులు రామానుజాచార్యులు నాగవల్లి దశరథ గట్ల సోమయ్య, గుండా రమేష్, దేవులపల్లి ప్రశాంతి, అండాల్డ్ గోష్టి సభ్యులు గోవింద మాల భక్తులు వివిధ దేవాలయాల బాధ్యులు సుమారు 1200 మంది భక్తులు ఈ సామూహిక గీతా పారాయణంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్