జనగామ జిల్లాలో ప్రైవేటు లగ్జరీ బస్సు దగ్ధం

312

జనగామ జిల్లాలో
ప్రైవేటు లగ్జరీ బస్సు దగ్ధం
-డ్రైవర్ చాకచక్యంతో ప్రయాణికులు సురక్షితం
– షార్ట్ సర్క్యూట్ కావడంతో జరిగిన ప్రమాదం
-జనగామ జిల్లా నెల్లుట్ల వద్ద ఘటన
-ప్రమాద సమయంలో బస్సు లో 26 మంది ప్రయాణికులు
-చత్తిస్ ఘడ్ నుంచి హైద్రాబాద్ కు వస్తుండగా ప్రమాదం

చత్తీస్ఘడ్ రాష్ట్రం నుండి హైదరాబాద్ వస్తున్న సెమీ లగ్జరీ బస్సు షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 26 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ చాకచక్యంతో ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలతో బయట పడ్డారు. సేమీ లగ్జరీ బస్సు చత్తీస్గడ్ నుండి వస్తున్న క్రమంలో జనగామ జిల్లా నెల్లుట్ల వద్ద కు రాగానే బస్సు బస్సు కింద నుండి పొగలు రావడాన్ని డ్రైవర్ గమనించి బస్సును పక్కకు ఆపివేశారు. ప్రయాణికులను అప్రమత్తం చేసి వెంటనే దింపేశారు. బస్సు ఇంజన్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ చాకచక్యాన్ని పలువురు అభినందించారు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి