జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ మెదక్ ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవం.
యదార్థవాది ప్రతినిది మెదక్
మెదక్ కోర్టు అవరణలో మంగళవారం జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ వారి అధ్వర్యంలో శ్రీ సరస్వతీ కాన్వెంట్ హై స్కూలు విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా న్యాయ సేవాధికార చైర్మన్ జిల్లా జడ్జి P.లక్ష్మి శారద, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ,సీనియర్ సివిల్ జడ్జి Ch.జితేందర్,మెదక్ బార్ అసోసిేషన్ ప్రెసిడెంట్ M.బాలయ్య,నామినేటెడ్ సభ్యులు S.కరుణాకర్,జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫజల్ అహ్మద్, ప్యానల్ న్యాయవాదులు,సీనియర్ అడ్వకేట్ లు,జూనియర్ అడ్వకేట్ లు పాల్గొన్నారు. పాఠశాల యాజాన్యం వారు ఇట్టి కార్యక్రమం నిర్వహించమని న్యాయ సేవా అధికార సంస్ధ వారిని కోరగా వెంటనే అనుమతి ఇచ్చి, విద్యార్ధులకు కావలసిన అన్ని వసతులు కల్పించి,రోజు వారీ కోర్టు పనులు కర్యవాహి ఎలా జరుగుతున్నాయో విద్యార్థులు కొర్టు అవరణలో ఉండి గమనించే లా అనుమతి ఇచ్చిన సెక్రటరీకీ పాఠశాల ప్రిన్సిపాల్ సుమిత్ర కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ మూర్తి మాట్లాడుతూ మహిళా సాధికారతే ధ్యేయంగా న్యాయవ్యవస్థ పని చేస్తోందని అందుకు అనుగుణంగా అన్ని శాఖలు పని చేయడం ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు పాఠశాల విద్యార్థులలో మాట్లాడి వారికి స్ఫూర్తిని ఇచ్చే విషయాలు చెప్పి,బాలికల దినోత్సవం సందర్భంగా శుభాభినందనల తెలిపారు. విద్యార్థులకు పలు అంశాల మీద అవగాహన కలిగిస్తూ న్యాయ సేవ అధికార సంస్థ చేసే పనులు,సేవలు, భాద్యతల గురించి సవివరంగా జిల్లా కార్యదర్శి విద్యార్థులకు వివరించి,వారిలో ఉత్సాహం నింపి,విద్యార్థుల సందేహాలు నివృత్తి చేసి వారికి ఆనందాన్ని కలిగించారు.ఈ కార్యక్రమంలో సెక్రటరీ విద్యార్థుల ప్రవర్తన,దైర్యం, సమయ పాలన,విలువలు వాటి ప్రాముఖ్యత,నిబద్దత,కృషి లాంటి పలు అంశాల గురించి మాట్లాడి విద్యార్థులకు దిశా నిర్దేశనం చేశారు. ఈ అవగాహన సదస్సులో శ్రీ సరస్వతీ కాన్వెంట్ హై స్కూలు విద్యార్థులలో పాటు ఉపాధ్యాయులు కుడా పాల్గొన్నారు చివరిగా బార్ ప్రెసిడెంట్ బాలయ్య,మెంబర్ కరుణాకర్, మాట్లాడుతు అడ్వకేట్ అవ్వడానికి ఎంచుకోవలసిన కోర్సులు, సమాజంలో న్యాయవాది ఒక్క ప్రాముఖ్యత,జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చేస్తున్న పనుల గురించి వివరించారు.