జిల్లాలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు.
ఎల్లలు దాటి వెల్లువలా తరలివచ్చిన భక్తజన సందోహం.
భక్తిప్రపత్తులతో మార్మోగిన ప్రార్థనలు.
మెదక్ యదార్థవాది ప్రతినిది
మెదక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు భక్తులతో కిక్కిరిసిన కరుణామయుని సన్నిధి..
ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, వేలాది మంది భక్తులు. కరుణామయుని కోవెల కిక్కిరిసిపోయింది. సోమవారం ప్రపంచ ప్రఖ్యాత గాంచిన మెదక్ సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి రాష్ట్రాలు జిల్లాలు దాటి తరలివచ్చిన లక్షలాది మంది భక్తులు సందర్శకులు ఏసయ్య దీవెనల కోసం బారులు తీరారు కిస్మస్ సందర్భంగా తెల్లవారు జామున 4.30 గంటల ప్రాంతంలో జరిగిన మొదటి ఆరాధనలో సీఎస్ఐ మెదక్ డయాసిస్ బిషప్ రెవరెండ్ పద్మారావు భక్తులకు వాక్యోపదేశం చేశారు. దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువును భూమిపైకి పంపించిన రోజే క్రిస్మస్ అని క్రీస్తును ఆరాధించడమే క్రిస్మస్ పండుగ అని తెలిపారు. క్రీస్తు రాక ఈ లోకానికి శుభసూచకమని ఆకాశంలో తోకచుక్క ఉద్భవించగానే ఈ విశ్వానికి వెలుగులా మన జీవితాలు మార్చడానికి వచ్చిన దేవుడే ఏసుప్రభు అని ప్రభువైన యేసు ఈలోకాన్ని ఎంతగానో ప్రేమించాడు ఆయన ఆచార్యకర్త ఆలోచన కర్త గల దేవుడు అని ఈ సమాజానికి అధిపతి అని అన్నారు. అహింస శాంతి ద్వారా సమసమాజ స్థాపన జరుగుతుందని మానవత్వమే ప్రభువు అభిమతమని అందుకే ఆయన చూపిన మార్గం అనుసరణీయమన్నారు శాంతి కరుణ ప్రేమప్రభువు బోధనలన్నారు వాటి స్థాపన కై దైవ కుమారుడిగా ఏసయ్య భూమి మీదకు వచ్చారని తెలిపారు. ప్రజలకు క్రైస్తవులకు మహా దేవాలయానికి విచ్చేసిన భక్తులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.