జిల్లాలో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్: జిల్లా ఎస్పీ
యదార్థవాది ప్రతినిది సిరిసిల్ల
జిల్లాలో 12 మంది బృందంతో విపత్తు నిర్వహణ పరిస్థితులలో పోలీసులు మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు ప్రతిస్పందన దళాన్ని(Disaster Response Force)టీమ్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.. ఈ సందర్భంగా ఎస్పీ
మాట్లాడుతూ జిల్లా పరిధిలో ప్రకృతి విపత్తుల నిర్వహణ కోసం ఇద్దరు RSI లతో పాటు పది మంది కానిస్టేబుల్స్ (2+10)తో DRF టీమ్ ఏర్పరిచి హైద్రాబాద్ లోని DRF శిక్షణ కేంద్రం నందు తగిన శిక్షణ ఇవ్వడం జరిగిందని సుశిక్షితులైన DRF సిబ్బంది భారీ వర్షాలు వరదలు ఫైర్ అసిసిడెంట్స్ భవనాలు కూలిపోయినవుడు ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు తక్షణమే స్పందించి ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా వివిధ శాఖల అధికారులను సమన్వయ పర్చుకుంటు చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. జిల్లా DRF టీమ్ కి 10 రోజుల పాటు శిక్షణ ఇచ్చినందుకు GHMC ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి కి జిల్లా ఎస్పీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
