25.8 C
Hyderabad
Thursday, June 13, 2024
హోమ్తెలంగాణజిల్లాలో ముదిరాజ్ భవనం లేని ఊరే లేదూ: హరీష్ రావు.

జిల్లాలో ముదిరాజ్ భవనం లేని ఊరే లేదూ: హరీష్ రావు.

జిల్లాలో ముదిరాజ్ భవనం లేని ఊరే లేదూ: హరీష్ రావు.

సిద్దిపేట యదార్థవాది ప్రతినిది

సిద్దిపేట జిల్లా మండంలోని పొన్నాలలో మూడు ఎకరాలలో ముదిరాజ్ ఏసీ కన్వేన్షన్ సెంటర్ ను శాసనమండలి చైర్మన్ బండ ప్రకాష్, రాష్ట్ర మచ్చాశాఖ చైర్మన్ పిట్టల రవీందర్ తో కలిసి ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక, వైద్య,ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ సిద్దిపేటలో రేపటి నుండి బెస్ట్ కన్వీన్షన్ సెంటర్ ముదిరాజ్ కన్వీన్షన్ సెంటర్ ను ఏడున్నర కోట్లతో అద్భుతంగా నిర్మించామని ఇంకా పూర్తి స్థయిలో పనుల కావాలంటే మరో రూ. 50 లక్షలు ఇస్తామని తెలిపారు. దేశంలోనే అన్ని కులాలకు భవనాలను నిర్మించింది సిద్దిపేట లో మత్రమే ముదిరాజ్ కులానికి భవనం లేని ఊరు నియోజకవర్గంలో లేదని అన్నారు. కొత్తగా 2000 సొసైటీలు ఏర్పాటు చేసి 2 లక్షల కొత్తగా సభ్యత్వలు ఇచ్చామని గతంలో 2 లక్షల సభ్యత్వాలు మాత్రమే నేడు 4 లక్షలు దాటిందని, వేయి కోట్ల రూపాయలతో ముదిరాజ్ ల కోసం సీఎం కేసీఆర్ సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ గ్రామంలోని చెరువులను ముదిరాజ్ సొసైటీలకే సీఎం కేసీఆర్ కేటాయించారని ఆయన అన్నారు. ముదిరాజ్ లకు రాష్ట్ర మంత్రి, ఎమ్మెల్యే, రాజ్యసభ ఎంపీ, శాసన మండలి వైస్ చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చామని జాతి అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. శాసనమండలి చైర్మన్ బండ ప్రకాష్ మాట్లడుతూ దేవాలయలున్న రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో మంత్రి సహకారంతో సత్రాలు కట్టుకుంటున్నామని సీఎం కేసీఆర్ కొకపేటలో 5 ఎకరాలు భూమిని ముదిరాజ్ సంక్షేమ భవన్ నిర్మాణానికి కేటాయించారని అన్నారు. మచ్చాశాఖ చైర్మన్ పిట్టల రవీందర్ మాట్లాడుతూ మత్స్యరంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా పథకాలను తీసుకువచ్చిందని, తెలంగాణా సాధించిన తరువాత మన రెండు కులాలకు మాత్రమే చేపలు పట్టుటకు అనుమతిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ వేలేటి రోజా శర్మ, ఎమ్మెల్సి కూర రఘూత్తమ రెడ్డి, మిన్సిపల్ వైస్ చైర్మన్ జెంగిటి కనకరాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్