జిల్లాలో వంద శాతం పోలింగ్ జరగాలి.
మెదక్ యదార్థవాది ప్రతినిది
ఓటు హక్కు వినియోగించుకున్న మెదక్ జిల్లా అదనపు ఎన్నికల అధికారి అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు సాధారణ ఎన్నికలు 2023 నియమావళి అమలులో బాగంగా శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం లో జిల్లా అదనపు ఎన్నికల అధికారి, అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు తన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పద్దతిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. వేలుకు సిరా చుక్క చూపిస్తూ ప్రజలంతా తమ అమూల్యమైన ఓటు ను వినియోగించుకోవాలన్నారు. మెతుకు సీమ లో 100 శాతం ఓటింగ్ లక్ష్యంతో ముందుకు వెళ్లాలని నవంబర్ 30 న ఓటర్లు తమకు కేటయించిన పోలింగ్ కేంద్రాల్లో కి వెళ్లి స్వచ్ఛందంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.