జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు..కలెక్టర్

239

జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు..కలెక్టర్

సిద్దిపేట 31 డిసెంబర్

నూతన సంవత్సరంలో జిల్లా ప్రజల జీవితాలలో నూతన కాంతులు విరబూయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆకాంక్షించారు. 2022 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2023 కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభసందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా ప్రజలకు ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, స్థానిక మంత్రి తన్నీరు హరీష్ రావు, ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతో జిల్లా అధికార యంత్రాంగం ముందుకు సాగుదాం.. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను జిల్లాలోని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెంది ప్రతి ఒక్కరు ఆయురారోగ్యంతో జీవిస్తూ, అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు విరబూయాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో ఆకాంక్షించారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి