25.8 C
Hyderabad
Thursday, June 13, 2024
హోమ్తెలంగాణజిల్లా ప్రజలు కొత్త సంవత్సరంలో సుఖశాంతులతో ఉండాలి: ఎస్ పి అఖిల్

జిల్లా ప్రజలు కొత్త సంవత్సరంలో సుఖశాంతులతో ఉండాలి: ఎస్ పి అఖిల్

జిల్లా ప్రజలు కొత్త సంవత్సరంలో సుఖశాంతులతో ఉండాలి: ఎస్ పి అఖిల్

సిరిసిల్ల యదార్థవాది ప్రతినిధి

జిల్లాలో వాహన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో పాల్గొన్న జిల్లా పోలీస్ సూపర్ డెంట్ అఖిల్ మహాజన్.. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వాహన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పాల్గొని వీధులలలో ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అనంతరం జిల్లా ప్రజలకు పోలీస్ సిబ్బందికి మీడియా ప్రతినిధులకు  జిల్లా పోలీస్ శాఖ తరువున నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ 2024 నూతన సంవత్సరంలో సరికొత్త ఆలోచనలతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని శాంతి భద్రతల పరిరక్షణ లో ప్రజలకు మరింత చేరువగా పని చేస్తామని నూతన సంవత్సరంలో ప్రజలందరూ  సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటు పోలీస్ శాఖ ఎప్పుడూ మీ సేవలో ఉంటుందని పేర్కొన్నారు. 

జిల్లాలో నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అవాంఛనియ సంఘటనలు జరగకుండా జిల్లాలో విస్తృత వాహన ,డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, పోలీస్ పెట్రోలింగ్ పార్టీలతో నిరంతరం నిఘా, బందోబస్తు చర్యలు తీసుకోవడం జరిగింది.ఎక్కడైనా న్యూసెన్స్ జరిగితే డయల్ 100 కాల్ చేయాలని తెలియజేయాలని సూచించారు. పోలీసు వారి నియమ నిబంధనలను పాటిస్తూ ప్రజలందరూ పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్